KCR SENTMENT : కేసీఆర్, జగన్ సెంటిమెంట్ కి చెక్.. దెబ్బకొడుతున్న బాబు-రేవంత్

రెండు రాష్ట్రాలు విడిపోయి పదేళ్ళయింది. ఆంధ్రవాళ్ళంటే... తెలంగాణకి... తెలంగాణ వాళ్ళంటే ఆంధ్రవాళ్ళకి గొడవే లేదు. ఎవరి రాష్ట్రాలు వారివే. ఎవరి పాలన వాళ్ళదే. ఎవరి బతుకులు వాళ్ళవే. విద్యార్థులు, నిరుద్యోగులైతే చదువులు, ఉద్యోగాలకు రెండు రాష్ట్రాల్లోనూ పోటీ పడుతున్నారు.

 

 

రెండు రాష్ట్రాలు విడిపోయి పదేళ్ళయింది. ఆంధ్రవాళ్ళంటే… తెలంగాణకి… తెలంగాణ వాళ్ళంటే ఆంధ్రవాళ్ళకి గొడవే లేదు. ఎవరి రాష్ట్రాలు వారివే. ఎవరి పాలన వాళ్ళదే. ఎవరి బతుకులు వాళ్ళవే. విద్యార్థులు, నిరుద్యోగులైతే చదువులు, ఉద్యోగాలకు రెండు రాష్ట్రాల్లోనూ పోటీ పడుతున్నారు. చదువుకుంటున్నారు… ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. కానీ ఇదే సెంటిమెంట్ రాజకీయాలను అడ్డం పెట్టుకొని మాజీ సీఎం కేసీఆర్ పదేళ్ళు అధికారం చెలాయించారు. పార్టీ ఎదుగుదల కోసమే తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకున్నారు. ఇప్పుడు ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఆ పాలిటిక్స్ చెక్ పెడతారన్న టాక్ నడుస్తోంది.

ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి అధికారంలోకి వచ్చాక… హైదరాబాద్ చేరుకున్న ఆయనకు ఘనంగా స్వాగతం పలికాయి టీడీపీ శ్రేణులు. సిటీ అంతటా పెద్ద పెద్ద కటౌట్లు, బ్యానర్లు, టీడీపీ జెండాలు కట్టారు. వీటిని చూపించి… తెలంగాణపై మళ్ళీ ఆంధ్రా పెత్తనం మొదలైందంటూ BRS సోషల్ మీడియా గగ్గోలు పెట్టింది. ఆ పార్టీ నేతలు కూడా తందానా అంటూ పాత రాగం అందుకున్నారు.
చంద్రబాబు – రేవంత్ భేటీలో 10యేళ్ళుగా పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలకు చెక్ పెట్టే దిశగా ఓ అడుగు వేశారు. రెండు రాష్ట్రాల సీఎస్ లు, మంత్రులతో కమిటీల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా మరికొన్ని రోజుల్లో ఈ సమస్యల్లో చాలా వరకూ తీరే అవకాశాలైతే ఉన్నాయి.
తెలంగాణకు పదేళ్ళుగా సీఎంగా ఉన్న కేసీఆర్ ఏనాడూ విభజన సమస్యల పరిష్కారానికి ప్రయత్నించలేదు. ఇటు కేసీఆర్, అటు జగన్ తమ రాష్ట్రాల సెంటిమెంట్ ను రగిల్చి… ఓట్లు పొందాలనే ఆలోచనతో పనిచేశారు. కేసీఆర్ మళ్ళీ గెలవడానికి జగన్ ఎంతకు తెగించారో… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాగార్జున సాగర్ డ్యామ్ మీద బలగాల మొహరింపును బట్టి అర్థమవుతుంది.

రేవంత్ రెడ్డి, చంద్రబాబు మీటింగ్ తర్వాత కేసీఆర్ సెంటిమెంట్ రాజకీయాలకు ఇక చెక్ పెట్టినట్టే అంటున్నారు విశ్లేషకులు. రాజకీయాలకు అతీతంగా రెండు రాష్ట్రాల విభజన సమస్యలను పరిష్కరించుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఐదేళ్ళల్లోనే చాలా సమస్యలు పరిష్కారం అయితే… నెక్ట్స్ అసెంబ్లీ ఎన్నికల నాటికి జగన్, కేసీఆర్ కి ఎత్తుకోడానికి సెంటిమెంట్ ఆయుధం దొరకదనే అనుకోవాలి.