Tirumala: తిరుమల నడక మార్గంలో చిన్నారిని చంపిన చిరుత చిక్కింది

గత రెండురోజుల క్రితం తిరుమలలో చోటు చేసుకున్న ఘటన యావత్ శ్రీవారి భక్తులకు కాస్త భయాన్ని కలిగించింది. దైవ దర్శనార్థం తిరుమల కాలినడక మార్గంలో వెళ్తున్న చిన్నరిని చిరుత చంపేయడం అందరినీ కలిచివేసింది. మరికొందరిలో తీవ్ర ఆందోళన వ్యక్తం అయింది. దీంతో టీటీడీ వెంటనే రంగంలోకి దిగి భద్రతా చర్యలు చేపట్టారు.

  • Written By:
  • Publish Date - August 14, 2023 / 08:57 AM IST

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మెన్ గా ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజు నుంచే భూమన కరుణాకర్ రెడ్డి తన విధులను శరవేగంగా నిర్వర్తిస్తున్నారు. చిన్నారి మృతి పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన టీటీడీ ప్రత్యేక భద్రతపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా దట్టమైన శేషాచలం అడవుల్లోని వృషాద్రి ప్రాంతంలో నిన్న ప్రత్యేకమైన నాలుగు బోనులు ఏర్పాటు చేశారు. అలాగే క్రూర మృగాల సంచారాన్ని పర్యవేక్షించడం కోసం కెమెరాలు అమర్చి మానిటరింగ్ చేశారు. దీంతో తిరుమల నడకదారిలో 2 రోజుల క్రితం చిన్నారి లక్షితను చంపిన చిరుత బోనులో చిక్కింది. నిన్న అర్ధరాత్రి ఒక బోనులో చిరుత పడ్డట్టు అధికారులు గుర్తించారు. రెండు రోజులుగా ఐదు ప్రాంతాల్లో చిరుత సంచారాన్ని గుర్తించి బోనులు ఏర్పాటు చేయగా.. ఎట్టకేలకు చిన్నారిపై దాడి చేసిన ప్రాంతానికి సమీపంలోనే చిరుత చిక్కిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

నేడు టీటీడీ హైలెవల్ మీటింగ్

తిరుమల నడకమార్గంలో చిరుత దాడిలో చిన్నారి మృతిచెందిన తరుణంలో.. భక్తుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఇవాళ TTD హెలెవల్ మీటింగ్ నిర్వహించనుంది. TTD ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో.. తిరుమల నడకదారి, ఘాట్ రోడ్లలో భక్తుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు, రక్షణ సిబ్బంది పెంపుపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే సర్వదర్శనం టికెట్లను పెంచే యోచనలో TTD ఉన్నట్లు సమాచారం.

T.V.SRIKAR