Kakinada : కాకినాడ సముద్రతీరంలో బోటు లో పేలిన సిలిండర్.. సముద్రంలో దూకిన మత్స్యకారులు

శుక్రవారం ఉదయం బంగాళాఖాతం సముద్రంలో కాకినాడ తీరంలో గోఘ పడవ ప్రమాదం చోటు చేసుకుంది. సముద్రంలోకి వెళ్లి తిరిగి వస్తుండగా.. బోటు లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. దీంతో సముద్రంలోకి దూకేసి మత్స్యకారులు.

శుక్రవారం ఉదయం బంగాళాఖాతం సముద్రంలో కాకినాడ తీరంలో గోఘ పడవ ప్రమాదం చోటు చేసుకుంది. సముద్రంలోకి వెళ్లి తిరిగి వస్తుండగా.. బోటు లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. దీంతో సముద్రంలోకి దూకేసి మత్స్యకారులు.

gas cylinder : దేశ వ్యాప్తంగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎంతో తెలుసా..?

ఇక విషయంలోకి వెళితే.. మత్స్యకారులు రోజులు నేతలు తరబడి సముద్రంలోకి వెళ్తుంటారు. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం బలహీనపడటంతో ఎవరు కూడా వేటకు వెళ్లకూడదని.. వాతావరణ శాఖ హెచ్చరికాలు జారీ చేసింది. ఈ నేపథ‌్యంలో సముద్రంలో వేటలో ఉన్న మత్స్యకారులు తీరిగి ఓడ్డుకు వస్తుండగా.. శుక్రవారం ఉదయం వంట చేస్తుండగా.. గ్యాస్ సిలిండర్ పెలడంతో బోటులో మంటల చోలరేగాయి. దీంతో ప్రాణాలు రక్షించుకునేందుకు మత్స్యకారులు సముద్రంలోకి దూకేసారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో బోటులో 11 మంది మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం. వెంటనే కోస్ట్ గార్డ్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో .. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ లో 11 మంది మత్స్యకారులను సురక్షితంగా కాపాడారు. ఇక ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు అని.. ఎవరికి గాయాలు కాలేదు అని.. తెలిపింది.

ఈ ఘటనతో మరోసారి మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
బంగాళఖాతంలో అల్ప పీడనం నేపథ్యంలో ఎవరూ వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.