Srinagar Jhelum River : జమ్ముకశ్మీర్ జీలం నదిలో ఘోర బోటు ప్రమాదం.. పలువురు చిన్నారులు గల్లంతు..

జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం శ్రీనగర్ (Srinagar) లోని జీలం నది (Jhelum River) లో పడవ బోల్తపడింది. ఈ పడవలో పాఠశాల పిల్లలు.. స్థానికులను తీసుకెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం శ్రీనగర్ (Srinagar) లోని జీలం నది (Jhelum River) లో పడవ బోల్తపడింది. ఈ పడవలో పాఠశాల పిల్లలు.. స్థానికులను తీసుకెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కాగా ఈ ఘటనలో 12 మంది పిల్లలు ఉన్నట్లు గుర్తింపు.. అందులో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఈ పడవ ప్రమాదంలో పలువురు గల్లంతు అయినట్లు అధికారులు తెలిపారు.

ఇక వివరాల్లోకి వెలితే.. గత 72 గంటలుగా కాశ్మీర్ లోయ (Kashmir Valley) లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో ఒక్క సారిగా జీలం నది ప్రవాహం పెరిగిపోయింది. దీన్ని గమనించక రోజులా.. ఈరోజు.. గండ్ బాల్ నుంచి శ్రీనగర్ లోని బట్వారాకు పాఠశాల విద్యార్థులను.. స్థానికులను నది నటిస్తుండగా తీసుకెళ్తుండగా.. పడవ బోల్తా పడింది. కాగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిరోజులుగా జమ్మూకాశ్మీర్‌లో హిమపాతానికి (snowfall) తోడు.. భారీ వర్షాల కారణంగా జీలం నది ప్రవాహం క్రమ క్రమంగా నీటి మట్టం పెరగడంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకాలు తప్పట్లేదు..

SSM..