పాప ఫొటో ఇప్పుడు ప్రతీ ఒక్కరి మనసు మెలేస్తోంది. కన్నీరు పెట్టేలా చేస్తోంది. బాచుపల్లిలో ఈ విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న గుంత చిన్నారి ప్రాణం తీసింది. తండ్రితో స్కూటీపై స్కూలుకు వెళ్తున్న సమయంలో.. అదుపుతప్పి బండి గుతంలో పడింది. దీంతో బైకు నుంచి జారి చిన్నారి కింద పడిపోయింది. వెనకాలే వస్తున్న స్కూల్ బస్సు.. చిన్నారి పైనుంచి వెళ్లటంతో అక్కడిక్కకడే చనిపోయింది. చిన్నారి తల్లిందండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రోడ్డుపై పడిపోయిన చిన్నారి మృతదేహాన్ని హత్తుకొని తండ్రి రోధించిన తీరు అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు గుంతలమయంగా మారాయ్. హైదరాబాద్‌లో చాలా దారులు దెబ్బతిన్నాయ్. గుంతలు కాదు.. గోతులు పడ్డాయ్ చాలా ప్రాంతాల్లో ! ఈ రోడ్లు ప్రమాదకరంగా మారి… నరకానికి నకలుగా మారిపోయాయ్. రాజకీయాల్లో బిజీగా ఉన్న నాయకులు.. కనీసం వాటిని పట్టించుకోవడం మానేశారు. అధికారుల సంగతి సరేసరి. ప్రాణం పోతేనే.. ఘోరం జరిగితేనో తప్ప.. అధికారులు స్పందించరా అని ఇప్పుడు జనాల నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. బాచుపల్లి విషయం ఇప్పుడు ప్రతీ ఒక్కరితో కన్నీరు పెట్టిస్తోంది. ప్రపంచం తెలియని చిన్నారి ప్రాణం పోయింది. ఆ పాపే ప్రపంచం అనుకున్న తల్లిదండ్రులకు ఎలా ధైర్యం చెప్పాలి దేవుడా అని కన్నీరు పెడుతున్న పరిస్థితి చాలామందిది.