Delhi, fire accident : దేశ రాజధానిలో భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది సజీవ దహనం..

ఢిల్లీలోని అలీపూర్‌లోని దయాల్‌పూర్ మార్కెట్‌లో గురువారం పెయింట్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 11 మంది సజీవ దహనం అయ్యారు. కాగా క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చగా.. నలుగురిలో ఒక పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు.

ఢిల్లీలోని అలీపూర్‌లోని దయాల్‌పూర్ మార్కెట్‌లో గురువారం పెయింట్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 11 మంది సజీవ దహనం అయ్యారు. కాగా క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చగా.. నలుగురిలో ఒక పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ప్రమాదపు రెస్క్యూ ఆపరేషన్ సమయంలో అతడు గాయపడ్డారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ (DFS) నుండి ఒక అధికారి మాట్లాడుతూ.. ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం గురించి సాయంత్రం 5.30 గంటల సమయంలో తమకు కాల్ వచ్చిందని, 22 ఫైర్ ఇంజన్ లను సేవలో ఉంచామని తెలిపారు. ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. దీంతో సమీపంలోని కొన్ని ఇళ్లు, దుకాణాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.

22 ఫైర్ ఇంజన్ వినియోగించగా.. రాత్రి 9 గంటల సమయానికి మంటలను అదుపులోకి తెచ్చామని, ఫ్యాక్టరీ ఆవరణలో 11 కాలిపోయిన మృతదేహాలను వెలికితీసినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఎక్స్ ఖాతాలో X ఒక పోస్ట్‌ చేశారు DFS చీఫ్ అతుల్ గార్గ్. ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలోని పెయింట్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంలో 11 మంది కార్మికులు మరణించారు. ఇందులో కొందరు డట్టమైన పొగకు ఆక్సిజన్ అందక అక్కడికక్కడే.. కుప్పకూలిపోగా.. ఫ్యాక్టరీ లోపల చిక్కుకున్న కార్మికులు మంటల్లో కాలిపోయారు.

దీని కారణంగా తమ సిబ్బంది వీరిని రక్షించలేక పోయామని తెలిపారు. ఇలా జరగడం చాలా దురదృష్టకరం అని విచారాన్ని వ్యక్తం చేశారు.” గోడౌన్లలో నిల్వ ఉంచిన రసాయనాల వల్ల పేలుడు సంభవించినట్లు ప్రాధమికంగా నిర్థరించారు. గాయపడిన నలుగురు జ్యోతి (42), దివ్య (20), మోహిత్ సోలంకి (34), పోలీస్ కానిస్టేబుల్ కరంబీర్ (35)గా గుర్తించారు. వీరిని రాజా హరీశ్‌చంద్ర ఆసుపత్రిలో చేర్చినట్లు అధికారి తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఈ ఘటనలో మరణించిన.. మృతదేహాలను బాబు జగ్జీవన్‌రామ్‌ ఆస్పత్రిలో భద్రపరిచారు. ఇక వాటిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇక ఈ ప్రమాదం కు గల కారణలపై.. ఢిల్లీ పోలీసులు దర్యప్తు చేయనున్నారు.