దేశంలో లోక్ సభ ఎన్నికల వేళ జమ్ముకశ్మీర్ లో భారీ ఉగ్రదాడి జరిగింది. దేశంలో దశలవారిగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో సైనికులపై ఉగ్రదాడి జరగడం దేవ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. కాగా జమ్ముకశ్మీర్ లోనూ ఐదు దశలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరిగేందుకు ముందుగానే ఆర్మీపై ఉగ్రవాదులు ఉగ్ర దాడికి పాల్పడ్డారు.
జమ్మూ-కశ్మీర్ (Jammu Kashmir)లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఇక్కడి పూంచ్ జిల్లాలోని శశిధర్ ప్రాంతంలో భద్రతా బలగాలకు చెందిన కాన్వాయ్‌పై ఉగ్రవాదులు (Terror Attack) ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంతోపాటు మరో దానిపైనా దాడికి దిగారు. ఈ ఘటనలో అయిదుగురు జవాన్లు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
ఈమేరకు సమాచారం అందుకున్న వెంటనే అదనపు బలగాలను ఘటనా స్థలానికి తరలించారు. ఉగ్రవాదులను గుర్తించేందుకు భారీ ఆపరేషన్ ప్రారంభించినట్లు చెప్పారు. గత ఏడాది నుంచి ఉగ్రవాదులు వరుసగా జవాన్లపై దాడులకు పాల్పడుతున్నారు. కాగా అదే ప్రాంతంలో ఈ ఏడాదిలో ఇదే మొదటి అతిపెద్ద దాడి జరిగింది.
పూంచ్ ఉగ్రదాడిపై రాహుల్ గాంధీ ట్వీట్
ఈ ఉగ్రదాడిని మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. వీరమరణం పొందిన జవాన్ కు సంతాపం తెలిపారు. జమ్మూకశ్మీర్లోని పూంచ్లో జవాన్లపై జరిగిన ఉగ్రదాడిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. “జమ్మూకశ్మీర్లోని పూంచ్లో మా ఆర్మీ కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడి చాలా సిగ్గుచేటు, బాధాకరం. అమరులైన జవానుకు నా వినయపూర్వకమైన నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. దాడిలో గాయపడిన సైనికులు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ట్వీట్ చేశారు.
SSM
जम्मू कश्मीर के पुंछ में हमारी सेना के काफिले पर कायराना और दुस्साहसी आतंकी हमला बहुत ही शर्मनाक है, दुखद है।
शहीद जवान को मैं अपनी विनम्र श्रद्धांजलि अर्पित करता हूं और उनके शोकसंतप्त परिजनों को संवेदनाएं व्यक्त करता हूं। हमले में घायल जवानों के जल्द से जल्द स्वस्थ होने की आशा…
— Rahul Gandhi (@RahulGandhi) May 4, 2024