Salt Costly Guru : కేజీ ఉప్పు రూ.53 వేలు.. దీని గొప్పదనం తెలిస్తే మతి పోద్ది..

కిచెన్‌లో అన్నిటికంటే చీప్‌గా దొరికే ఇంగ్రీడిఎంట్ ఏంటి అంటే అంతా సింపుల్‌గా చెప్పే మాట ఉప్పు. అవును అన్నిటి కంటే అదే చీప్‌గా దొరుకుతుంది. బ్రాండ్‌ని బట్టి రేట్లలో మార్పులు ఉన్నా.. కేజీ 30 రూపాయలకు మించి ఏ బ్రాండ్‌ ఉప్పు కూడా ఉండదు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఉప్పు గురించి వింటే మాత్రం మీ మైండ్‌ బ్లాంక్‌ అవ్వడం గ్యారంటీ. ఎందుకంటే.. ఇది మామూలు రేట్‌ ఉప్పు కాదు. కేజీకి ఏకంగా 53 వేలు. అవును.. మీరు విన్నది నిజమే.. ఈ ఉప్పు కేజీ విలువ అక్షరాల 53 వేలు.

కిచెన్‌లో అన్నిటికంటే చీప్‌గా దొరికే ఇంగ్రీడిఎంట్ ఏంటి అంటే అంతా సింపుల్‌గా చెప్పే మాట ఉప్పు. అవును అన్నిటి కంటే అదే చీప్‌గా దొరుకుతుంది. బ్రాండ్‌ని బట్టి రేట్లలో మార్పులు ఉన్నా.. కేజీ 30 రూపాయలకు మించి ఏ బ్రాండ్‌ ఉప్పు కూడా ఉండదు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఉప్పు గురించి వింటే మాత్రం మీ మైండ్‌ బ్లాంక్‌ అవ్వడం గ్యారంటీ. ఎందుకంటే.. ఇది మామూలు రేట్‌ ఉప్పు కాదు. కేజీకి ఏకంగా 53 వేలు. అవును.. మీరు విన్నది నిజమే.. ఈ ఉప్పు కేజీ విలువ అక్షరాల 53 వేలు. అంత రేట్‌ పెట్టేలా ఇందులో స్పెషాలిటీ ఏముందా అనుకుంటున్నారా. అక్కడికే వస్తున్నా వెయిట్‌. తమిళనాడులోని కరూర్‌ నగరత్తార్‌ సంఘం ఆధ్వర్యంలో ఏటా పిళ్లయార్‌ వ్రత దీక్ష ఉత్సవాలు జరుగుతాయి. అక్కడి ప్రజలు ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.

భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవాల్లో పాల్గొంటారు. కార్తీక మాసం మొదటి రోజున వేడుకల ప్రారంభించి చివరి రోజున ముగిస్తారు. కార్తీక మాసంలో దీక్ష చేపట్టేవాళ్లందరిక భక్తులు కానుకులు ఇవ్వడం ఇక్కడి ఆనవాయితీ. మాసంలోని చివరి రోజున దీక్ష విరమించిన తరువాత కానులకు వేలం వేస్తారు. వీటిని దేవుడి వస్తువులుగానే అంతా భావిస్తారు. ఇదే క్రమంలో ప్రతీ ఏడు లాగే ఈసారి కూడా ఇక్కడ కార్తీక మాసం కానుకలను వేలం వేశారు. కానీ ఎప్పుడు లేని విధంగా ఈసారి ఉప్పు భారీ ధర పలికింది. ఈ కానుకల్లో వచ్చిన కేజీ ఉప్పును ఓ భక్తులు 53 వేలకు వేలం పాడాలు. దేవుడి నుంచి వచ్చిన ఉప్పుగానే దాన్ని భావింది అంత ధరకు సొంతం చేసుకున్నాడు. దీంతో ప్రస్తుతం ఈ ఉప్పు ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.