Air Purifier: ఇంట్లో దుమ్ము, ధూళిని క్షణాల్లో శుభ్రం చేసే రోబోటిక్ ఎయిర్ ప్యూరిఫైయర్లు..

ప్రస్తుత సమాజంలో ఎటు చూసినా కాలుష్యమే కనిపిస్తుంది. స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలంటే ఏ పచ్చని గార్డెన్లనో లేకుంటే నగరానికి చాలా దూరంగా నివసించాల్సి ఉంటుంది. అందుకే చాలా మంది ఊరికి చివరన ఇళ్లను తీసుకునేందుకు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. గాలి కాలుష్యం రోజు రోజుకూ కోరలు చాస్తుంది. అందుకే మన ఇంట్లో లేదా ఆఫీసుల్లో స్వచ్చమైన గాలిని అందించే సరికొత్త సాధనాలు మార్కెట్ లోకి ఎయిర్ ప్యూరిఫైయర్ అందుబాటులో వచ్చాయి. ఇవి ఎలా పని చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కరోనా తరువాత మనదేశంతో పాటూ ప్రపంచం మొత్తం స్వయం నియంత్రణ, ఆరోగ్య భద్రతపైన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇంటిని తమ చుట్టూ ఉండే పరిసరాల పై కూడా శ్రద్ద చూపిస్తున్నారు. దీంతో ఎయిర్ ప్యూరిఫైయర్ల పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే కొరియన్ డిజైనర్ సాంగ్ ఇల్ సిన్ అనే అతను ప్లాని పేరుతో రోబోటిక్ ఎయిర్ ప్యూరిఫైయర్ ను తయారు చేశారు.

పనిచేయు విధానం..

ఈరోబో ఎయిర్ ప్యూరిఫైయర్ ను మనం ఉండే గదిలో ఏదో ఒకచోట ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సాధారణ ఫ్యాను ఏర్పాటు చేసుకున్నట్లే వీటిని కూడా అమర్చుకోవచ్చు. మనకు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఈ మిషీన్ ను ఆన్ చేయాల్సి ఉంటుంది. ఇది మన గది విస్తీర్ణం బట్టీ వాటి సామర్థ్యానికి తగ్గట్టు పనిచేస్తాయి. వాటంతట అవే రూం మొత్తం కలియ తిరుగుతూ దీని చుట్టూ ఉన్న మట్టి, దుమ్ము, దుర్వాసనలను తొలగిస్తుంది. ఇది పూర్తిగా కరెంట్ మీద ఆధారపడి పనిచేస్తుంది. మనం వినియోగించే దాన్ని బట్టి చార్జింగ్ ఖర్చు అవుతుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేస్తుంది. మిషీన్ ఆన్ చేసి అది శుభ్రపరిచేందుకు మన హాలు, కిచెన్, బెడ్ రూం మొత్తం తిరిగే క్రమంలో దానికి ఎవరైనా అడ్డువచ్చినా పక్కకు తప్పుకొని దానిపని అది చేసుకుపోతుంది. ఒకవేళ అధికంగా దుమ్ము, ధూళి ఉన్న ప్రాంతాల్లో కాస్త ఎక్కువ సమయం వెచ్చించి పనిచేస్తుంది. దీని ధర సుమారు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 10వేలకు పైనే ఉండొచ్చు.

T.V.SRIKAR