Firing Stone: అగ్గిపుల్ల లేకుండానే నిప్పు.. పాండవులు వాడిన మొక్క.. సైన్స్‌కు కూడా అందని రహస్యం

ఛండీగడ్ అడవుల్లో పాండవ బత్తీ పేరుతో ఒక వృక్షపు ఔషధాలతో కూడిన బత్తి నిప్పు పుట్టించే గుణాన్ని కలిగి ఉంది.

  • Written By:
  • Publish Date - October 5, 2023 / 07:10 PM IST

నిప్పు ఎలా పుట్టిందంటే.. ఆది మానవుడు ఒక రాయిని ఇంకో రాయితో.. రాపాడించాడు అప్పుడు పుట్టింది నిప్పు అంటారు కదా. మన చదువులు చెప్పింది కూడా అదే. నిజానికి అదే నిజం కూడా ! ఐతే అగ్గిపుల్ల గీయకుండానే.. నిప్పు అంటించే మొక్క ఒకటి ఉంది అంటే మీరు నమ్ముతారా! అలా కూడా ఉంటుందా.. ఇదేందయ్యా ఇది అని అనుకుంటున్నారేమో.. అదే నిజం మరి. అసలు విషయం తెలుసుకోవాలంటే ఛండీగడ్ అడవుల్లోకి వెళ్లాల్సిందే! హిమాయాలల్లో పెరిగే మొక్కలకు ఎన్నో ఔషద గుణాలు ఉంటాయ్. అలాంటిదే.. ఈ పాండవ బత్తి.

ఔషద గుణంతో పాటు అద్భుతమైన లక్షణం.. పాండవ బత్తి సొంతం. హిమాలయాల్లోని అడవుల్లోనే ఈ మొక్కను గుర్తించారు. పాండవబత్తిలో రకరకాల జాతులు ఉంటాయ్. ఒక్కో రకాన్ని బట్టి 1 నుంచి 5 మీటర్ల ఎత్తు పెరుగుతాయ్. పాండవ బత్తి శాస్త్రీయ నామం.. కాలికర్పా టొమంటోసా. వెర్బనా అనే వృక్ష జాతికి చెందిందీ మొక్క. ఈ చెట్టుకు పూసే పూలు.. 4 మిల్లీ మీటర్ల పొడవు ఉంటాయ్. ఈ ఆకులకు ఒకరకమైన ఆయిల్ అప్లై చేస్తే.. ప్రకాశవంతంగా మెరుస్తాయ్. మంటలు పుడతాయ్. ఇక వీటి కాయలకు అగ్గిపుల్లను దగ్గరగా తీసుకువెళ్తే చాలు.. అది ఆటోమేటిక్‌గా మండుతుంది.

ఇక ఆ కాయలను నీటిలో వేస్తే ఆ నీటికి కూడా అగ్గిపుల్లను మండించే గుణం వస్తుంది. మహాభారతంలోనూ ఈ చెట్టు ప్రస్తావన కనిపిస్తుంది. పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు.. నిప్పు రగిలించేందుకు ఈ మొక్కలనే వాడారనేది ఓ నమ్మకం. పూర్వం అడవిలో పాండవులు ఈ చెట్టు కాయలను మంట పుట్టించేందుకు, టార్చ్‌ లైట్‌లా ఉపయోగించేందుకు వాడేవారట. అందుకే వీటికి పాండవ బత్తి అని పేరు వచ్చింది. ఈ చెట్టు ఆకులకు కాస్త నూనె రాస్తే చాలు.. అవి వత్తిలా మండుతాయి. కేవలం ఇది మాత్రమే కాదు. చాలా ఔషదాల తయారీలో కూడా ఈ కాయలను ఉపయోగిస్తారు. చాలా అరుదుగా దొరికే ఈ మొక్క వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఐనా సైన్స్‌ ఇంకా పూర్తిగా వివరాలు రాబట్టలేకపోయింది.