Wayanad Landslides : కేరళలో ప్రకృతి విలయతాండవం.. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 93కి చేరిన మృతుల సంఖ్య!

వయనాడ్‌ (Wayanad) లో విలయం విషాదం నింపింది. చిన్నారులు, వృద్ధులు.. ఒకరేమిటి.. ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో అనేకమంది ఉన్నారు. నిద్రలో ఉన్న సమయంలో జరిగిన ఘటన కావడంతో ఎవరూ ఈ ప్రమాదం నుంచి బయటపడలేకపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 4గంటల వ్యవధిలోనే మూడుసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి.

దక్షిణాది రాష్ట్రం కేరళలో పెను విషాదం చోటు చేసుకుంది. అందాలకు.. ఎత్తైన జలపాతాలు (Waterfalls) .. పచ్చని ప్రకృతి ఒడిలో.. సాగర తీరంలో ఉన్న అద్భుత రాష్ట్రం ఇప్పుడు కొండచరియలు (Landslides) విరిగిన ఘటన దేశం మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. కేరళలోని వయనాడ్‌ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 93 మంది మరణించారు. 70 మందికి గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

  • నిద్రమత్తులో మృత్యువు ఒడిలోకి..

వయనాడ్‌ (Wayanad) లో విలయం విషాదం నింపింది. చిన్నారులు, వృద్ధులు.. ఒకరేమిటి.. ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో అనేకమంది ఉన్నారు. నిద్రలో ఉన్న సమయంలో జరిగిన ఘటన కావడంతో ఎవరూ ఈ ప్రమాదం నుంచి బయటపడలేకపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 4గంటల వ్యవధిలోనే మూడుసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. చూరల్‌మాల గ్రామం అసలు కనిపించకుండా పోయింది. అనేక మంది ఆచూకీ తెలియడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

  • శిథిలాల కింద నుంచి బాధితుల ఫోన్‌కాల్స్‌..!

శిథిలాల కింద సుమారు 400 మంది చిక్కుకున్నట్లు సమాచారం.. శిథిలాల్లో చిక్కుకుపోయిన వారు తమ ఆత్మీయులకు ఫోన్లు చేసి ప్రాణాలు కాపాడాలని విలపించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ సంభాషణలో ఓ మహిళ తమ వారికి ఫోన్‌ చేసి.. ‘‘ఇల్లు మొత్తం పోయింది. మా వాళ్లు ఎక్కడ ఉన్నారో అర్థం కావడం లేదు. ఎవరో ఒకరు వచ్చి సాయం చేయండి’’ అని బిగ్గరగా రోదిస్తూ అవతలి వారిని కోరింది. దీంతో ఎన్డీఆర్‌ఎఫ్‌, నౌకాదళం, వైమానిక సిబ్బంది మొత్తం 225 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కాగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. చురల్మల వద్దనున్న ఏకైక వంతెన, ప్రధాన రహదారి ధ్వంసమయ్యాయి. దీంతో 250మంది NDRF సిబ్బంది ముండకై ఆవలవైపు సహాయక చర్యలు చేపడుతున్నారు. సైన్యం ఇక్కడ తాత్కాలిక వంతెనను నిర్మిస్తే ఆ ప్రాంతానికి చేరుకొని చర్యలు చేపట్టనున్నారు. అసలు ఆ గ్రామంలో పరిస్థితి ఏమిటనేది ఇప్పటివరకు పూర్తి సమాచారం తెలియడం లేదు.

  • వయనాడ్ ఘటనలో బాదితులను పరామర్శించిన మంత్రి ఏకే శశీంద్రన్..

వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో గాయపడిన వారిని కేరళ రాష్ట్ర అటవీ, వన్యప్రాణి సంరక్షణ శాఖ మంత్రి ఏకే శశీంద్రన్ మెప్పాడి ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 43కి చేరింది. మరో 70 మందికి గాయాలు కాగా.. ఆసుపత్రికి మెప్పాడి తరలించారు. శిథిలాల కింద దాదాపు 400 మంది చిక్కుకున్నట్లు సమాచారం. ఎన్డీఆర్‌ఎఫ్‌, నౌకాదళం, వైమానిక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

  • వయనాడ్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు..

కేరళలోని వయానాడ్‌లో నేషనల్ హెల్త్‌మిషన్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది.అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు 9656938689, 8086010833 కూడా జారీ చేయబడ్డాయి. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రెస్క్యూ ఆపరేషన్ కోసం ఆర్మీ రంగంలోకి దిగింది. నాలుగు బృందాలను సమీకరించారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇప్పటివరకు మోహరించిన మొత్తం దళాల సంఖ్య 225, ఇందులో వైద్య సిబ్బంది కూడా ఉన్నారు.

  • కేరళ వయనాడ్ ఘటన పై ప్రముఖుల స్పందన..

కేరళ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..

కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేరళ సీఎం విజయన్‌తో మాట్లాడి అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు మోదీ ట్వీట్ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సానుభూతి తెలియజేశారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలను ఆదేశించినట్లు Xలో పేర్కొన్నారు.

 

వయనాడ్ లో విరిగిపడిన కొండచరియలు ఘటన స్థలంలో జరిగిన ప్రకృతి విపత్తును దగ్గరుండి పర్య వేస్తున్న కేరళ సీఎం పినరాయ్ విజయ్

 

కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 40 మందికి పైగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్‌కు వెళ్లనున్నారు. ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్‌తో రాహుల్ మాట్లాడారు.

 

Suresh SSM