Hyderabad New Virus : హైదరాబాద్‌లో కొత్త వైరస్ కలకలం.. కరోనాకు మించి ప్రమాదమా..

కరోనా భయాల నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. కోవిడ్‌ మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. దాదాపు మూడేళ్లు.. కంటికి కనిపించని శత్రువుతో.. బయటకు కనిపించని యుద్ధం చేశాడు మనిషి.

కరోనా భయాల నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. కోవిడ్‌ మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. దాదాపు మూడేళ్లు.. కంటికి కనిపించని శత్రువుతో.. బయటకు కనిపించని యుద్ధం చేశాడు మనిషి. దీంతో వైరస్ పేరు చెప్తే చాలు వణికిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. ఇప్పుడు అలాంటి వైరస్ ఒకటి తెలంగాణను.. ముఖ్యంగా హైదరాబాద్‌ను భయపెడుతోంది.. అదే నోరో వైరస్. ఈ వైరస్ కేసులు హైదరాబాద్‌లో ఎక్కువగా కనిపిస్తున్నాయ్. వారంరోజుల వ్యవధిలో పాతబస్తీ ఏరియాలో వందల సంఖ్యలో నోరో వైరస్ కేసులు రికార్డ్ అయ్యాయ్. ఇది అంటువ్యాధిగా డాక్టర్లు గుర్తించారు. నోరో వైరస్‌ను వింటర్ వామిటింగ్ బగ్ అని కూడా అంటారు. వానాకాలంలో ఈ వైరస్ సోకుతుంది. నోరో వైరస్ సోకిన వారు.. వాంతులు, విరేచనాలతో బాధపడతారు. ఒకరి నుంచి మరొకరికి ఈజీగా ఇది వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తులతో దగ్గరగా ఉన్నవారికి.. కలుషిత పరిసరాల వల్ల ఈవైరస్ సులభంగా వ్యాపిస్తుంది.

వైరస్ సోకిన వారిలో చాలామంది రెండు, మూడు రోజుల్లోనే కోలుకుంటారు. నోరో వైరస్ కోసం ప్రస్తుతానికి ఎలాంటి టీకా అందుబాటులో లేదు. డాక్టర్లు సూచించిన మాత్రలు వాడటంతోనే.. రెండు నుంచి మూడు రోజుల్లో కోలుకోవచ్చు. చేతులను తరుచుగా శుభ్రంగా సబ్బుతో కడుక్కోడంతో పాటు… వైరస్ బారిన పడిన వ్యక్తి యూజ్ చేసిన బట్టలను వేడి నీటిలో శుభ్రం చేయాలి. వైరస్ సోకిన వ్యక్తిలో 48 గంటల్లోనే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ మధ్య వయస్కులు, సీనియర్ సిటిజన్‌లు, గర్భిణులు, కౌమారదశలో ఉన్న బాలికలలో తీవ్రమైన కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ను కలిగిస్తోందని డాక్టర్లు చెప్తున్నారు. షుగర్‌ వ్యాధిగ్రస్తులు ఎక్కువుగా ఈ వైరస్ బారినపడే అవకాశాలు ఉన్నాయ్.