సారథిగా అరుదైన రికార్డ్ ధోనీ సరసన రోహిత్ శర్మ

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న చెన్నై టెస్టులో సారథిగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత బంగ్లాదేశ్‌తో మూడు ఫార్మాట్లు ఆడిన రెండో భారత్‌ కెప్టెన్ గా నిలిచాడు.

  • Written By:
  • Publish Date - September 19, 2024 / 07:30 PM IST

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న చెన్నై టెస్టులో సారథిగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత బంగ్లాదేశ్‌తో మూడు ఫార్మాట్లు ఆడిన రెండో భారత్‌ కెప్టెన్ గా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో ఓ టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సారథ్యం వహించడం ఇదే తొలిసారి. 2017-2021 వరకు విరాట్ కోహ్లీకి డిప్యూటిగా వ్యవహరించిన రోహిత్ శర్మ.. అతని గైర్హాజరీలో జట్టును నడిపించాడు. ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌పై రోహిత్ 6 వన్డేలతో పాటు ఏడు టీ20లు, ఒక టెస్ట్ మ్యాచ్‌కు కెప్టెన్ గా వ్యవహరించాడు. ధోనీ మాత్రం 11 వన్డేలు, 5 టీ20లు, ఒక టెస్ట్‌కు కెప్టెన్సీ చేశాడు. గతంలో కోహ్లీ, గంగూలీ, ద్రవిడ్, సెహ్వాగ్, కేఎల్ రాహుల్‌లు బంగ్లాదేశ్‌తో రెండు ఫార్మాట్లలోనే కెప్టెన్‌గా ఉన్నారు.