పాక్ గడ్డపై ఐసీసీ డెలిగేట్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ఏర్పాట్లపై రివ్యూ

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. దీని కోసం ఇప్పటికే పాక్ క్రికెట్ బోర్డు పనులు మొదలుపెట్టింది. స్టేడియాల రెన్యువల్ తో పాటు సెక్యూరిటీ, షెడ్యూల్ వంటి అంశాలపై ఐసీసీకి ప్రెజెంటేషన్ కూడా ఇచ్చింది.

  • Written By:
  • Publish Date - September 18, 2024 / 05:13 PM IST

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. దీని కోసం ఇప్పటికే పాక్ క్రికెట్ బోర్డు పనులు మొదలుపెట్టింది. స్టేడియాల రెన్యువల్ తో పాటు సెక్యూరిటీ, షెడ్యూల్ వంటి అంశాలపై ఐసీసీకి ప్రెజెంటేషన్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో పాక్ చేస్తున్న ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఐసీసీ అధికారుల బృందం తాజాగా కరాచీలో పర్యటిస్తోంది. ఆటగాళ్ళు బస చేసే హోటల్స్ , మ్యాచ్ లకు ఆతిథ్యమిస్తున్న స్టేడియాలతో పాటు ఇతర ఏర్పాట్లపైనా పూర్తి వివరాలు తెలుసుకోనుంది. ఇదిలా ఉంటే పాక్ లో ఆడేందుకు భారత్ తప్ప అన్ని జట్లూ అంగీకరించాయి. బీసీసీఐ మాత్రం టీమిండియా మ్యాచ్ లను తటస్థ వేదికలో నిర్వహించాలని కోరింది. లేకుంటే టోర్నీ నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.