Telangana, Governor : తెలంగాణకు గవర్నర్ గా రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి.. తెలంగాణ 4వ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ…

తెలంగాణ (Telangana) గవర్నర్ (Governor) మార్పు.. తెలంగాణ రాష్ట్రానికి మరో కొత్త గవర్నర్ రాబోతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు.

తెలంగాణ (Telangana) గవర్నర్ (Governor) మార్పు.. తెలంగాణ రాష్ట్రానికి మరో కొత్త గవర్నర్ రాబోతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. తెలంగాణ గవర్నర్‌గా త్రిపుర (Tripura) మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్‌ వర్మ (66)ను నియామకo అయ్యారు. తెలంగాణతో పాటు దేశంలోని ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌ శనివారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వూలు జారీ చేశారు. ఏడుగురిని కొత్తగా నియమించగా, మరో ముగ్గురిని ఒక రాష్ట్రం నుంచి మరోరాష్ట్రానికి బదిలీ చేశారు.

9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. వీళ్లే..

తెలంగాణకు జిష్ణుదేవ్ వర్మ (Jishnudev Verma), రాజస్థాన్‌కు హరిభౌ కిసన్ రావ్, సిక్కింకు ఓం ప్రకాశ్ మాథుర్, మహారాష్ట్రకు సీపీ రాధాకృష్ణన్, జార్ఖండ్‌కు సంతోష్ కుమార్ గంగ్వార్, ఛత్తీస్‌గఢ్‌కు రామన్ దేకా, మేఘాలయకు సీహెచ్ విజయశంకర్, అస్సాం, మణిపుర్‌కు లక్ష్మణ్ ప్రసాద్, పంజాబ్‌కు గవర్నర్‌గా, చండీగఢ్‌కు ఎల్జీగా గులాబ్ చంద్‌ను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.

తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్‌ వర్మ…

తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ నియమితులయ్యారు. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి (Ex Deputy Chief Minister) అయిన ఆయనతే ప్రస్తుత ఇంచార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ స్థానంలో రానున్నారు. గతంలో జిష్ణుదేవ్‌ వర్మ త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా 2018 నుంచి 2023 సేవలందించారు. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (Badminton Association of India) అధ్యక్షుడిగానూ కొనసాగారు. రాజ కుటుంబానికి చెందిన జిష్ణుదేవ్‌ 1957 ఆగస్టు 15న జన్మించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి (Indrasena Reddy) త్రిపుర గవర్నర్‌గా నియమితులుకాగా, ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని తెలంగాణ గవర్నర్‌గా నియమించారు. ఝార్ఖండ్‌ గవర్నర్‌గా పని చేస్తన్న సీపీ రాధాకృష్ణన్‌ (CP Radhakrishnan) ను ఇప్పటివరకూ తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనను తాజాగా కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు బదిలీ చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న రమేష్‌ బైస్‌ను తప్పించింది. ఇక రాజస్థాన్‌ (Rajasthan) గవర్నర్‌గా మహారాష్ట్ర మాజీ స్పీకర్‌ హరిభావ్‌ కిషన్‌రావ్‌ బాగ్డేని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది. ఈ స్థానంలో ఉన్న సీనియర్‌ నేత కల్‌రాజ్‌ మిశ్రాను తప్పించింది.

Suresh SSM