భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కు బిగ్ బాష్ లీగ్ వేలంలో షాక్ తగిలింది. హర్మన్ ను కొనేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. గతంలో మెల్బోర్న్ రెనిగేడ్స్, సిడ్నీ థండర్లకు ఆడిన అనుభవమున్న ఈ సీనియర్ బ్యాటర్‌పై ఎనిమిది ఫ్రాంచైజీల్లో ఏ ఒక్క జట్టు కూడా ఆసక్తి చూపలేదు. అయితే మరో ఆరుగురు భారత మహిళాల క్రికెటర్లకు మాత్రం బీబీఎల్ లో ఆడే అవకాశం దక్కింది. ఓపెనర్ స్మృతి, ఆల్‌రౌండర్ శిఖా పాండే, టాపార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌లు ఇది వరకే ఈ లీగ్‌లో ఆడారు. కొత్తగా ఆల్‌రౌండర్ దయాళన్ హేమలత, వికెట్ కీపర్ బ్యాటర్ యస్తిక భాటియాలకు తొలిసారిగా బిగ్‌బాష్ లో అడుగుపెట్టనున్నారు. కాగా వేలంలో ప్లాటినమ్ కేటగిరీలో ఎంపికైన దీప్తి శర్మ 62.41 లక్షలు అందుకోనుంది.