కారు దిగి చేయి పట్టుకునే ఎమ్మెల్యేలనే చూశాం కానీ.. చేయి వదిలేసి కారెక్కిన ఎమ్మెల్యేగా మారిపోయారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (Bandla Krishnamohan Reddy). ఈయన నిర్ణయంతో.. రెండో విడత రైతు రుణమాఫీ వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్‌లో (Congress) చేరిన బండ్ల… తిరిగి కారుపార్టీలో చేరారు. ఓ వైపు అధికార కాంగ్రెస్ ఆపరేషన్ (Congress operation) ఆకర్ష్‌తో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా పార్టీలో చేర్చుకుంటుండగా.. ఈ ఊహించని పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో మొత్తం పది మంది ఎమ్మెల్యేలు చేరగా.. కృష్ణ మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకోవడంతో ఈ సంఖ్య 9కి చేరింది.
దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 75 నుంచి 74కు పడిపోయింది. కాంగ్రెస్‌లో చేరిన వారిలో అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ (Dana Nagender), కడియం శ్రీహరి (Kadiam Srihari), పోచారం, డాక్టర్ సంజయ్, కాలేరు యాదయ్య, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్‌లో పొసగక పోవడం, గ్రూపు తగాదాలు ఉండడంతో సొంత గూటికి వెళ్లాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని మాజీ జెడ్పీచైర్ పర్సన్ సరిత వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. గాంధీభవన్‌లో ధర్నా కూడా చేపట్టారు.
ఐతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) … వాళ్లందరినీ బుజ్జగించి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఐతే ఇప్పుడు అదే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రేవంత్ రెడ్డికి షాక్ ఇస్తూ.. గులాబీ పార్టీలో చేరారు. ఒకవైపు కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు, అనర్హత వేటు అంశం కూడా పరిగణనలోకి తీసుకొని… ఆయన మళ్లీ సొంత గూటికి చేరారని తెలిసింది. చేరికలు వన్ వే అన్నట్లు కనిపిస్తున్న వేళ బండ్ల తీసుకున్న నిర్ణయం.. రేవంత్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లు అయిందనే చర్చ జరుగుతోంది.
ఇప్పుడు రాస్కొండి “బీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ అబ్బా” అని.
తిరిగి సొంత గూటికి చేరుకున్న గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసి పార్టీలో కొనసాగుతా అని తెలిపిన ఎమ్మెల్యే pic.twitter.com/zEHtrEaY8V
— BRS Party (@BRSparty) July 30, 2024