America Shut Down: ఆర్థిక సంక్షోభం నుంచి ఒడ్డున పడ్డ అమెరికా.. జోబైడెన్ ప్రభుత్వానికి తప్పిన షట్ డౌన్ ముప్పు..

అమెరికాకు గత కొన్ని రోజులుగా ఇబ్బంది పెడుతున్న ఆందోళన వీడింది. అక్టోబర్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో కొన్ని బిల్లులకు ఆమోదం పొందింది జో బైడెన్ ప్రభుత్వం. దీంతో కొంత ఉపశమనం లభించి షట్ డౌన్ పరిస్థితులు తప్పినట్లయింది.

  • Written By:
  • Publish Date - October 2, 2023 / 07:59 AM IST

అమెరికాలో రెండు రకాలా పార్టీలు ఉన్నాయి. ఒకటి రిపబ్లికన్, రెండు ఫెడరల్. ఈ రెండింటిలో ఫెడరల్ పార్టీ నాయకుడు జో బైడెన్ అధికారంలో ఉన్నారు. అయితే రిపబ్లికన్లు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. ఏదైనా బిల్లు చట్టసభల్లో ప్రవేశ పెడితే వీరి మద్దతు కూడా తప్పని సరిగా ఉండాలి. ఇలాంటి తరుణంలో జో బైడెన్ ప్రవేశ పెట్టిన కొన్ని ద్రవ్య వినిమయ బిల్లులను ఆమోదించేందుకు సుముఖత చూపలేదు. దీంతో ఆర్థిక లావాదేవీలకు కుంటు పడుతుందేమో అన్న పరిస్థితులు దాపరించాయి. దీంతో అత్యవసరమైన కొన్ని సంస్థలకు బిల్లులు సాకాలంలో చెల్లించలేమేమో అన్న అనుమానం తలెత్తింది. దీంతో ఆర్థిక సంక్షోభంలోకి అమెరికా వెళ్లిపోతుందా అని చాలా మంది భావించారు. అయితే చివరి క్షణంలో జో బైడెన్ సమయస్పూర్తితో ఊపిరి పీల్చుకున్నారు అక్కడి ప్రజలు. షట్ డౌన్ ముప్పు తాత్కాలికంగా తప్పినట్లయింది.

ఆమోదించిన బిల్లులు ఇవే..

దేశ వ్యాప్తంగా వివిధ రకాలా సంక్షేమ పథకాలకు సంబంధించిన బిల్లులను, సైనికుల అవసరానుగుణంగా నిధులు విడుదల, ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు. ఇలాంటి వాటిని సభలో తిరిగి ప్రవేశ పెట్టారు. వీటిని రిపబ్లికన్లు ఆమోదం తెలిపాయి. దీనికి కారణం ఇవి ప్రజా ఉపయోగమైన, అవసరమైన సేవలు. వీటిని అడ్డుకుంటే రిపబ్లికన్లను జో బైడెన్ బూచిగా చూపి తన రాజకీయంగా బలపడే ప్రభావం ఉంది. అందుకే వీటిని ఆమోదించేలా సరికొత్తగా అత్యవసర బిల్లులను ప్రవేశ పెట్టేలా వ్యూహం రచించారు. దీంతో మొదట నిరాకరించిన వారే ఆమోదించేలా చేశారు. ఇక్కడ గమనించ వలసిన అంశం ఏమిటంటే రిపబ్లికన్లకు చెందిన నాయకుడే సభాధిపతి. అయినప్పటికీ ప్రజాయోగ్యమైన బిల్లులు కావడంతో ఆమోదింపజేసేలా రిపబ్లికన్లు ఆయనను నచ్చజెప్పారు. దీంతో స్వల్పకాలిక బిల్లులను స్పీకర్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం పాసైన బిల్లులతో ఆర్థిక సంక్షోభం నుంచి వీడి 45 రోజుల వరకూ ఉపశమనం కలిగినట్లయింది జోబైడెన్ ప్రభుత్వానికి.

ఈ మండలం రోజుల్లోపూ ప్రతిపక్షాలను నచ్చజెప్పేలా చేసుకోవాలి. లేకుంటే మొదటికే మోసం వచ్చే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందంటున్నారు రాజకీయ నిపుణులు.

T.V.SRIKAR