Mexico tower collapsed : మెక్సికోలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన టవర్.. ఐదుగురు కార్మికులు దుర్మరణం

మెక్కికో దేశంలో భార ప్రమాదం.. సెంట్రల్ మెక్సికోలోని సెంట్రల్ స్టేట్ హిడాల్లోలో రోడ్డు ప్రాజెక్టు 50 అడుగుల (14 మీటర్లు) స్కాఫోల్డింగ్ కూలిపోయింది. ఈ భారీ ప్రబాదంలో ఐదుగురు కార్మికులు అక్కడిక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

మెక్కికో దేశంలో భార ప్రమాదం.. సెంట్రల్ మెక్సికోలోని సెంట్రల్ స్టేట్ హిడాల్లోలో రోడ్డు ప్రాజెక్టు 50 అడుగుల (14 మీటర్లు) స్కాఫోల్డింగ్ కూలిపోయింది. ఈ భారీ ప్రబాదంలో ఐదుగురు కార్మికులు అక్కడిక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. శనివారం కార్మికులు హైవే రిటైనింగ్ వాల్ లా కనిపించే భారీ నిర్మాణానికి సిమెంట్ పోస్తుండగా.. ఫారాలు, పరంజా కూలిపోయింది. దీంతో ఐరన్, తడి సిమెంట్ లో కార్మికులు చిక్కుకుపోయి చనిపోయారు. శిథిలాల కింద ఇంకా కొంత మంది కార్మికులు ఉన్నారని వారిని రక్షుస్తున్నమని రవాణా శాఖ వెల్లడించింది. కాగా ఈ టవర్ నిర్మాణం ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ నిర్మిస్తుండటంతో టవర్ నిర్మాణంలో ఎదైనా నన్యత లోపించిందా అని వాటిపై విచారణ జరుపుతుమని అన్నారు రవాణ శాఖ మంత్రి.

గతంలో అక్టోబర్ 2న మెక్సికోలోని తమౌలిపాస్లో పెద్ద ప్రమాదం జరిగింది. ఓ చర్చి పైకప్పు కూలి ఐదుగురు మృతి.. ఇక్కడ ఒక చర్చి పైకప్పు కూలిపోవడంతో ఐదుగురు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. చర్చి పైకప్పు కూలిపోయినప్పుడు సుమారు 100 మంది అక్కడ పనిలో ఉన్నారు.

ఇక బాప్టిజం జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. వేడుక జరుగుతుండగా చర్చి పైకప్పు కూలిపోయిందని టాపిక్ రోమన్ కాథలిక్ డియోసెస్ బిషప్ జోస్ ఆర్మాండో అల్వారెజ్ తెలిపారు.