Pakistan, valley accident : పాకిస్థాన్‌లో ఘోరం ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 20 మంది మృతి

పాకిస్తాన్ లో మరో ఘోర ప్రమాదం జరిగింది. డయాన్ జిల్లాలోని కారకోరం హైవే దగ్గర బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు.

భారత్ పొరుగు దేశం పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ లోని డయామర్ జిల్లాలోని బస్సు లోయలో పడటంతో 20 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఇక విషయంతోకి వెళితే..
పాకిస్తాన్ (Pakistan) లో మరో ఘోర ప్రమాదం జరిగింది. డయాన్ జిల్లాలోని కారకోరం హైవే దగ్గర.. తెల్లవారుజామున సింధు నది ప్రవహించే రాతి లోయలో పడిపోయింది.  ఈ ప్రమాదంలో 20 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 30 మంది ప్రయాణికులతో కూడిన ఓ బస్సు రావల్పిండి నుండి గిల్గిట్ బాల్టిస్థాన్ వైపు వెళ్తుంది. ఈ క్రమంలో మార్గమధ్యలో డయామర్ జిల్లాలోని కారకోరం హైవే వద్దకు రాగానే.. అదుపుతప్పి లోయలో పడింది. గమనించిన స్థానికులు, వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది.

కొంతకాలంగా పాకిస్థాన్ లో తరచూ బస్సు ప్రమాదాలు (bus accident) చోటు చేసుకుంటున్నాయి. ఫిబ్రవరి నెలలో అతివేగంతో ప్రయాణిస్తున్న బస్సు ఖైబర్ పఖ్తుంఖ్వాలో లోయలో పడిపోయింది. ఆ ప్రమాదంలో 10 దుర్మరణం పాలయ్యారు. మరో కటి పాకిస్థాన్ లోని బలూచిస్థాన్​లోని లాస్బెలా ప్రాంతాల్లో అతి వేగంగా వెళ్తున్న ఓ బస్సు ఫ్లైఓవర్​ పిల్లర్​ను ఢీకొని అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘోర ప్రమాదంలో సుమారుగా 42 మంది మృత్యువాత చెందారు. కాగా ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 48 మంది ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు.

SSM