Nepal Landslides : నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. కొండచరియలు పడి.. నదిలో కొట్టుకుపోయిన బస్సులు.. 63 మంది గల్లంతు!

నేపాల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్‌లోని మదన్-ఆశ్రిత్ హైవేలో ఇవాళ తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడడంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి.

నేపాల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్‌లోని మదన్-ఆశ్రిత్ హైవేలో ఇవాళ తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడడంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి. దీంతో డ్రైవర్లతో సహా 63 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎడతెరిపి లేని వర్షం వల్ల గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఆ దేశ పీఎం ప్రచండ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులను వెంటనే రక్షించాలని అధికారులను ఆదేశించారు.

ఇక వివరాళ్లోకి వెళితే..
ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో మదన్-ఆశ్రిత్ హైవే నుంచి నేపాల్ రాజధాని ఖాట్మండుకు వెళ్తున్న ఏంజెల్ బస్సు, గణపతి డీలక్స్ ప్రమాదానికి గురయ్యాయి. ఒక బస్సులో 24 మంది, మరో బస్సులో 41 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. కాగా వర్షం భారీగా పడటంతో సహాయక చర్యలకు తీవ్ర అటకం ఏర్పాడింది. దీంతో సహాయక చర్యలలో సాయం అందించేందుకు అదనపు సిబ్బంది, భద్రతా దళాలను ఖాట్మండు నుంచి ప్రమాద ప్రాంతానికి పంపించారు.