బిహార్‌లో పట్టాలు తప్పిన రైలు.. ఏడుగురు దుర్మరణం

బిహార్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ నుంచి అసోంతోని కామాఖ్యకు వెళ్తున్న నార్త్‌ ఈస్గ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. బిహార్‌లోని రఘునాథ్‌పూర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ట్రైన్‌ పట్టాలు తప్పడంతో ట్రైన్‌లోని ఆరు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు చనిపోగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి 9 గంటల 35 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

బిహార్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ నుంచి అసోంతోని కామాఖ్యకు వెళ్తున్న నార్త్‌ ఈస్గ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. బిహార్‌లోని రఘునాథ్‌పూర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ట్రైన్‌ పట్టాలు తప్పడంతో ట్రైన్‌లోని ఆరు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు చనిపోగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి 9 గంటల 35 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చాలా మందిని ఇప్పటికే హాస్పిటల్‌కు తరలించారు. ఇందులో కొందరి కండీషన్‌ సీరియస్‌గా ఉన్నట్టు డాక్టర్లు చెప్తున్నారు.

రైలు ప్రమాదంపై బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఎన్డీఆర్‌ఎఫ్‌కు, గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖకు సూచించారు. కేంద్ర సహాయక మంత్రి అశ్విని కుమార్‌ చౌబే కూడా రైలు ప్రమాదంపై స్పందించారు.  ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని ఘటనాస్థలికి పంపించామని, తీవ్రంగా గాయపడ్డ ప్రయాణికులను పట్నాలోని ఎయిమ్స్‌కి తరలిస్తామని చెప్పారు. ఈ ప్రమాదంలో దాదాపు అన్ని బోగీలు పట్టాలు తప్పాయి. ఆరు బోగీలు ప్రమాదకర స్థాయిలో పల్టీలు కొట్టాయి. ప్రస్తుతానికి ఏడుగురు వ్యక్తులు చనిపోయినప్పటికీ మృతుల సంఖ్య మరింత పెరిగే చాన్స్‌ ఉందని డాక్టర్లు చెప్తున్నారు. మొత్తం 70 మంది గాయపడగా అందులో 20 మంది పరిస్థితి క్రిటికల్‌గా ఉందని డాక్టర్లు చెప్తున్నారు.  వీళ్లందరికీ ప్రస్తుతం ట్రీట్‌మెంట్‌ కొనసాగుతోంది.