Uttar Pradesh: జెండర్ మార్చి వండర్ క్రియేట్ చేసిన యువతులు..

కాలంలో గతానికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చేస్తుంది. అది టెక్నాలజీ పరంగానే కాదు. శాస్త్రపరంగానూ ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతం అవుతున్నాయి. వీటిని ఉపయోగించుకొని కొందరు వండర్స్ క్రియేట్ చేస్తుంటే.. మరికొందరు జండర్ మార్చుకొని షాక్ ఇస్తున్నారు. తాజాగా ఒక అమ్మాయి అబ్బాయిగా మారి ఒక యువతిని పెళ్లిచేసుకునేందుకు సిద్దమయ్యారు. షాకింగ్ గా అనిపిస్తున్న వీరి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

  • Written By:
  • Publish Date - July 15, 2023 / 04:06 PM IST

అమ్మాయిలు.. అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం. అబ్బాయిలు అబ్బాయిలను, అమ్మాయిలు అబ్బాయిలను పరిణయమాడటం కాస్త విచిత్ర పరిణామం. దీనికి సుప్రీం కోర్టు కూడా సంచలనమైన తీర్పు వెల్లడించింది. అలా కాకుండా పురుషుడు ట్రాన్స్ ఉమెన్ ను జీవిత భాగస్వామిగా స్వీకరించడం చాలా అసాధారణమైన అంశం. కానీ ఇక్కడ అసాధారణతకే అసాధ్యం అనిపించే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అదే అమ్మాయి అబ్బాయిగా మారి పెళ్లికి సిద్దం అవ్వడం.

ఈ యువతులిద్దరిదీ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం. ఒకరిది బరేలి ప్రాంతం కాగా మరొకరు బదాయూ కి చెందిన వారు. వీరి ప్రాంతాలు వేరు కావచ్చు మనసులు ఒక్కటయ్యాయి. బంధం కూడా ఒకటి కావాలని నిర్ణయించుకున్నారు. ఎలా అనుకుంటున్నారా.? ఇద్దరూ ఒకే ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. కొన్ని రోజులకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమ కాస్త పెళ్లి చేసుకోవాలనే ఆలోచనకు దారితీసింది. ఒకరిని ఒకరు అర్ధం చేసుకునే స్వభావం ఉండటంతో వివాహం చేసుకొని దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. తమ కుటుంబ సభ్యులకు చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ల ఇరువురి పేరెండ్స్ దీనికి అస్సలు అంగీకరించలేదు.

తమ మనసులోని మాట చెప్పారు. దీనికి తల్లిదండ్రుల నుంచి సానుకూల స్పందన వస్తుందని భావించారు. ప్రతికూల స్పందన రావడంతో వారిని కాదని తామే స్వయంగా పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యారు. ఈ జంటలోని ఒక అమ్మాయి తన కన్యత్వాన్ని ధారపోసి అబ్బాయిగా మారేందుకు సిద్దమైంది. ట్రాన్స్ జండర్గా పూర్తి చికిత్స అనంతరం పెళ్లి చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలనుకున్నారు. అన్ని డాక్యూమెంట్స్ తీసుకొని స్థానికంగా ఉండే సబ్ డివిజినల్ కోర్టులో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కి అర్జీ పెట్టుకున్నారు. “ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు. అందుకే వీరి పెళ్లి దరఖాస్తును స్వీకరించాం. ఇలాంటి కేసు తమ దృష్టికి రావడం ఇదే మొదటిసారి కనుక చట్టం ప్రకారం ముందుకు వెళ్తాం” అని బరేలి మెజిస్ట్రేట్ ప్రత్యూష్ పాండే బదులిచ్చారు.

దీనిని బట్టి అర్థం అయ్యిందేమిటంటే భవిష్యత్తులో ఆడపిల్లలు తక్కువ ఉన్నారు. అబ్బాయిలకు.. అమ్మాయిలు దొరకడం కష్టం అనుకునే వారికి ఇది చక్కని పరిష్కారం చూపిస్తుందేమో చూడాలి. ఎందుకంటే అబ్బాయిలను ప్రేమించి మోసపోయే ఘటనలకన్నా.. అమ్మాయిలు అమ్మాయిలే ప్రేమించుకొని ఇలా లింగాన్ని మార్చుకోవడం వల్ల కొంత వరకు ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే కేవలం ప్రేయసి కోసం సర్జరీ చేయించుకొని ప్రియుడిగా మారి జీవితాన్ని పంచుకోవాలనుకుంటారు. అందుకే వీరిని వదిలి వెళ్లలేరు. అది అంత సులభం కూడా కాదు. పైగా వీరి దేహమే మార్పు చెందింది. మనసు, ఆలోచనలు అన్నీ ప్రేమించినప్పుడు ఎలా ఉంటాయో అలాగే ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని ప్రభుత్వాలు ఆమోదించాలంటే ప్రత్యేకంగా వీరికోసం ఒక చట్టాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు ఎన్ని చోటు చేసుకుంటాయో వేచిచూడాలి.

T.V.SRIKAR