సాధారణంగా ఉద్యోగాలు వ్యక్తి ప్రొఫైల్ చూసి లేదా అతని పర్సనాటిటీని, మార్క్స్, టాలెంట్, అనుభవం బట్టి ఇస్తూ ఉంటారు. కానీ తన దేహం రంగు తెల్లగా ఉందని ఒక కంపెనీ ఆమెను నియామకాల నుంచి తప్పించింది. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ప్రతీక్ష జిక్కర్ అనే నిరుద్యోగ యువతి కొన్ని సైట్లలో జాబ్ సర్చ్ చేయడంతో ఒక ఉద్యోగానికి సంబంధించిన ప్రకటన ఆమె కంట పడింది. దీనికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశ పరీక్షతో సహా మూడు రౌండ్లలో జరిగిన ఇంటర్వూలో సెలక్ట్ అయ్యారు. ఇలా అన్ని రౌండ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఆమెకు రిజెక్ట్ లెటర్ దర్శనం ఇచ్చింది.
దీనిపై ఆ యువతి స్పందించారు. ఎందుకు నన్ను ఉద్యోగానికి అర్హత నుంచి తప్పించారు అని అడిగారు. అప్పుడు కంపెనీ ఆమెకు నీవు మా కంపెనీలో పని చేసే వాళ్లకంటే కూడా ఎక్కువ తెల్లగా ఉన్నావు. అందుకే నిన్ను సెలెక్ట్ లిస్ట్ నుంచి తప్పిస్తున్నాము అంటూ పంపిన మెయిల్ చూసి షాక్ తిన్నారు. కంపెనీ పంపిన మెయిల్ కి సదరు బాధితురాలు తనదైన శైలిలో రిప్లే ఇచ్చారు. ఉద్యోగాలు ప్రతిభను చూసి ఇవ్వండి ఇలా తెలుపు, నలుపు రంగులు చూసి కాదు అని పోస్ట్ చేశారు. వీటిని ఆమె తన లింక్ డిన్ సైట్లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట పై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం బహుశా ఇదే మొదటి సారి.
T.V.SRIKAR