AAP minister Raaj Kumar: ఆప్ మంత్రి రాజీనామా.. కేజ్రీవాల్‌ పతనం మొదలైందా..?

ఆప్‌ ప్రభుత్వానికి ఇప్పుడు అసలైన ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మంత్రి రాజ్‌కుమార్‌ ఆనంద్‌ పార్టీ సభ్యత్వానికి మంత్రి పదవికి రాజీనామా చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఆనంద్‌.. ఇక ఆప్‌లో కొనసాగలేనని స్పంష్టం చేశారు.

  • Written By:
  • Publish Date - April 10, 2024 / 05:23 PM IST

AAP minister Raaj Kumar: ఢిల్లీ లిక్కర్‌ స్కాం దేశంలో క్రియేట్‌ చేసిన సెన్సేషన్‌ గురించి సపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈ వ్యవహారం అటు తిరిగీ ఇటు తిరిగీ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను కూడా జైలుపాలు చేసింది. అవినీతికి వ్యతిరేకంగా అవతరించిన పార్టీలో ఏకంగా ముఖ్యమంత్రి అవినీతి కేసులో అరెస్ట్‌ అవ్వడం సంచలనంగా మారింది. ఈ దెబ్బతో కేజ్రీవాల్‌ పని ఐపోయిందని చాలా మంది బీజేపీ నేతలు మాట్లాడారు. కానీ సీన్‌ మాత్రం అందుకు వ్యతిరేకంగా నడుస్తూ వచ్చింది. స్కూళ్లు, రోడ్లు, మున్సిపాలిటీలను బాగు చేసిన వ్యక్తిగా కేజ్రీవాల్‌కు పట్టం కట్టిన ఢిల్లీ ప్రజలు.. కేజ్రీవాల్‌ను ఓ అవినీతిపరుడిగా నమ్మలేదు.

Nandamuri Balakrishna: సైకిల్ రావాలంటూ.. బాలయ్య బస్సుయాత్ర..

దీనికి తోడు జైలు నుంచే కేజ్రీవాల్‌ పాలన ప్రారంభించడం బీజేపీకి దిమ్మతిరిగే షాకిచ్చింది. నీటి సమస్య లేకుండా చూడాలి అని జైలు నుంచి కేజ్రీవాల్‌ జారీ చేసిన జీవో.. ఆయనపై సాఫ్ట్‌ కార్నర్‌ను మరింత పెంచింది. అలా కౌంటర్‌ వ్యూహంతో నడుస్తున్న ఆప్‌ ప్రభుత్వానికి ఇప్పుడు అసలైన ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మంత్రి రాజ్‌కుమార్‌ ఆనంద్‌ పార్టీ సభ్యత్వానికి మంత్రి పదవికి రాజీనామా చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఆనంద్‌.. ఇక ఆప్‌లో కొనసాగలేనని స్పంష్టం చేశారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌ తరువాత ఆమ్‌ ఆద్మీ పార్టీలో జరిగిన అతిపెద్ద కుదుపు ఇదే. దీంతో ఇక ఆ పార్టీ పతనం మొదలైందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక్కడ అన్నిటికంటే పెద్ద ట్విస్ట్‌ ఏంటి అంటే.. రీసెంట్‌గానే రాజ్‌ ఆనంద్‌ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఇది జరిగిన కొన్ని రోజులకే ఆయన రాజీనామా చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. కేజ్రీవాల్‌ అరెస్ట్‌ వ్యవహారంలో తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది అనే విషయం పక్కన పెడితే. కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను దాదాపు అంతా రాజకీయ కక్షగానే చూశారు. ఈ దెబ్బతో ఢిల్లీని బీజేపీ కైవసం చేసుకుంటుంది అనుకున్నారు.

కానీ ఢిల్లీలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపించింది. కేజ్రీవాల్‌ అరెస్ట్ ఐనా.. పాలన మాత్రం ఆగలేదు. కేజ్రీవాల్‌ భార్య సీఎం బాధ్యత తీసుకుంటారని చర్చ వచ్చినా ఎక్కడా వ్యతిరేక నినాదాలు వినిపించలేదు. అరెస్ట్‌ తనను ఆపలేదు అన్నట్టు జైలునుంచే కేజ్రీవాల్‌ జీవోలు జారీ చేయడం పార్టీని మరింత బలంగా చేసింది. ఇలాంటి టైంలో మంత్రి రాజీనామా చేయడం.. అది కూడా ఈడీ రైడ్స్‌ జరిగిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు అనేక అనుమానాలకు దారితీస్తోంది. కేసులతో కేజ్రీవాల్‌ను బీట్‌ చేయలేని బీజేపీ ఇలా ఆప్‌ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేస్తోంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగా రాజ్‌కుమార్‌ ఆనంద్‌ నిర్ణయం వెనక బీజేపీ ఒత్తిడి ఉందా.. లేక ఆయనే ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న విషయం పక్కన పెడితే.. ఆప్‌ ప్రభుత్వంలో పునాదులు కదలడం ప్రారంభమైంది అనేది మాత్రం క్లియర్‌. మొన్నటి వరకూ ఎంతో బలంగా ఐకమత్యంగా ఉన్న ఆప్‌ ప్రభుత్వం ఇకముందు ఎలా మారుతుందో చూడాలి.