సినిమా రేంజ్ లో ఏసీబీ ఎటాక్, అడిషనల్ కలెక్టర్ కు గురిపెట్టి కొట్టారు…!

రంగారెడ్డి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి లంచాలు తీసుకుంటున్నారు అనే సమాచారం తెలుసుకున్నారు ఏసీబీ అధికారులు. ఎలా అయినా భూపాల్‌రెడ్డిని అరెస్ట్‌ చేయాలనుకుని పక్కా ప్లానింగ్ తో దాడికి దిగారు.

  • Written By:
  • Publish Date - August 13, 2024 / 10:41 AM IST

సాధారణంగా ఏసీబీ అధికారులు ఎవరిని అయినా టార్గెట్ చేస్తే చాలా పక్కాగా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఏసీబీ ఎటాక్ అంటే ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజన్ ఉంటాయి. నేడు జరిగిన ఒక దాడి చూస్తే… అది నూటికి నూరుపాళ్ళు వాస్తవం అనుకుంటారు. సినిమాల్లో ఎలా ఉంటుందో అలాగే జరిగింది. గురి పెట్టి కొడితే తగలాల్సిందే అని ప్రూవ్ చేసింది ఏసీబీ. రంగారెడ్డి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి లంచాలు తీసుకుంటున్నారు అనే సమాచారం తెలుసుకున్నారు ఏసీబీ అధికారులు.

ఎలా అయినా భూపాల్‌రెడ్డిని అరెస్ట్‌ చేయాలనుకుని పక్కా ప్లానింగ్ తో దాడికి దిగారు. ప్రోహిబిటేడ్ లిస్టు నుంచి భూమిని తొలగించడానికి 8 లక్షలు డిమాండ్ చేసాడు భూపాల్ రెడ్డి. బాధితుడు ముత్యం రెడ్డి నుంచి ఈ సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు… ఆయన తరుపున లంచం తీసుకునే సీనియర్ అసిస్టెంట్ మదన మోహన్ ను ట్రాప్ చేసారు. ముత్యం రెడ్డి మదన మోహన్ కు 8 లక్షలు డబ్బులు ఇచ్చాడు.

అప్పుడు ఏసీబీ అధికారులు పక్కనే ఉండి… మదన్ మోహన్ తో భూపాల్ రెడ్డికి ఫోన్ చేయించారు. పెద్ద అంబర్ పేట అవుటర్ రింగ్ రోడ్డు దగ్గరకు డబ్బులు తీసుకు రావాలని భూపాల్ రెడ్డి చెప్పాడు. వెంటనే మదన్ మోహన్ తో కలిసి అధికారులు భూపాల్ రెడ్డి చెప్పిన ప్రదేశానికి వెళ్ళారు. డబ్బులు ఎందుకు తీసుకున్నావని అసిస్టెంట్ ను అక్కడే ఏసీబీ అధికారులు అడగగా… అడిషనల్ కలెక్టర్ చెప్తేనే తీసుకున్నా అంటూ సమాధానం ఇచ్చాడు. వెంటనే భూపాల్ రెడ్డిని, మదన్ మోహన్ ను అరెస్ట్ చేసి… భూపాల్‌రెడ్డి నివాసంలో దాడులు చేసి… రూ.16 లక్షలు సీజ్‌ చేసారు.