ACB Raids: హెచ్‌ఎండీఏలో భారీ అవినీతి అనకొండ బయటపడింది. హెచ్ఎండిఏ మాజీ ఉద్యోగి శివ బాలకృష్ణ ఇంటిపై ఏసీబీ సోదాలు జరిపి, రూ.500 కోట్ల అక్రమాస్తుల్ని గుర్తించారు. దీంతో అతడిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఇంకా సోదాలు చేస్తున్నారు. మణికొండలోని అతడి ఇంటితోపాటు దాదాపు 20 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ ఇంటితోపాటు బంధువులు, కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి.
CM REVANTH REDDY: రేవంత్ సమాచారం లీక్.. వాళ్ళందర్నీ మార్చేశారు
దాదాపు ఇరవై మంది అధికారులు ఆయన ఇంట్లోనే ఆరు గంటలకుపైగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో బాలకృష్ణ హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేశారు. బాలకృష్ణ.. తన పదవిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తించింది. పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలు, నగదును అధికారులు సీజ్ చేశారు. దాదాపు రూ.500 కోట్ల వరకు ఆస్తులు కూడబెటినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. బినామీల పేరుతో ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది. ఇంట్లో అణువణువునా సోదాలు చేస్తున్నారు. పలు బ్యాంక్ లాకర్లు ఉన్నట్లు గుర్తించారు. బాలకృష్ణ కారులో సైతం సోదాలు చేశారు.
బాలకృష్ణ పై అవినీతి ఆరోపణలు వచ్చాయని, అందుకే విచారణ చేస్తున్నామని, బ్యాంక్ లాకర్లపై కూడా ఆరా తీస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. బాలకృష్ణ ఏసీబీ విచారణకు సహకరించడం లేదన్నారు. అతడి ఇంట్లో డాక్యుమెంట్లు సీజ్ చేసినట్లు, అవసరమైతే ఇంకా మూడు, నాలుగు గంటలు పాటు సోదాలు కొనసాగించనున్నట్లు అధికారులు వెల్లడించారు.