తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆరు గ్యారెంటీలే తమ మొదటి ప్రాణం అని చెప్పవచ్చు. అటు కర్ణాటకలో.. ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తిసుకోచ్చింది ఈ ఆరు గ్యారెంటిల పథకమే అని చెప్పవచ్చు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని చెప్పిందో.. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఒకదాని వెనుక ఒకటి అనుకుంటే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. ఆ దిశగా చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఆరు గ్యారెంటీల అమలుకు లబ్ధిదారులను గుర్తించేందుకు సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే ప్రజాపాలన.. ఈ నెల 28 నుంచి.. జనవరి 6 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఈ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా.. పది రోజుల పాటు గ్రామాల్లో సభలు నిర్వహించి ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నారు. అయితే.. ఈ దరఖాస్తులు ఎక్కడ దొరుకుతాయి. వాటి లో ఏమేమి వివరాలు ఇవ్వాలి. ఏ డాక్యుమెంట్లు కావాలి. ఇలా అనేక సందేహాలున్నాయి జనాలకు. వాటన్నింటికి సమాధానంగా.. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ప్రజా పాలన దరఖాస్తు ఫారం విడుదల చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆరు గ్యారెంటీల అమలు కోసం.. అభయహస్తం ప్రజా పాలన దరఖాస్తు పేరుతో ఓ అప్లికేషన్ ఫారం సిద్ధం చేసి విడుదల చేసింది. ఆరు గ్యారెంటీలు అంటే ఆరు ఫారంల్లో వివరాలు నమోదు చేయ్యాల్సిన సవసరం లేకుండా.. అన్నింటికీ ఒకేసారి దరఖాస్తు పెట్టుకునేలా కాంగ్రెస్ సర్కార్ దీన్ని ఈ అభయహస్తం తయారు చేసింది. మొదట కుటుంబ వివరాలను నింపాల్సి ఉంటుంది. ఈ కుటుంబ వివరాల్లో భాగంగా యజమాని పేరుతో మొదలై.. పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నెంబర్, రేషన్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, వృత్తి, కులంతో పాటు మిగిలిన కుటుంబ సభ్యుల వివరాలు కూడా నింపాల్సి ఉంటుంది.
ఆ తర్వాత.. వరుసగా మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి, చేయూత పథకాలకు సంబంధించిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ఫారంలో లబ్ధిదారులు ఏ పథకానికి దరఖాస్తు చేయాలనుకుంటే.. ఆ పథకం కింద అడిగిన వివరాలను అక్కడ నమోదు చేయాలి.
పైన పేర్కొన్న వివరాలు ఇచ్చాక.. కింద.. దరఖాస్తు దారుని పేరు, సంతకం, తేదీ వంటీ వివరాలు నమోదు చేయాలి.
ఈ దరఖాస్తుకు ఆధార్ కార్డు జిరాక్స్‌తో పాటు, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్‌ను కూడా జతపర్చాల్సి ఉంటుంది. ఇలా నింపిన దరఖాస్తును గ్రామసభలో అధికారికి అందించి.. వాళ్లు అడిగిన వివరాలు చెప్తే.. వాళ్లు చెక్ చేసి దరఖాస్తు దారు ఏఏ పథకానికి అర్హులన్నది నిర్ణయిస్తారు. అలా.. దరఖాస్తు చివర్లో ఉన్న రశీదులో నమోదు చేసి.. సంతకం చేసి, ప్రభుత్వ ముద్ర వేసి ఇస్తారు. దీంతో మీ ఆరు గ్యారెంటీల పథకం కు సంబంధించిన వివారాలన్ని కూడా ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారంతో ఉంటాయి. దాన్ని ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ఆరు గ్యారెంటీల స్కీం అములు అవుతుంది.
గ్రేటర్ హైదరాబాద్ లోని 150 వార్డుల్లో ఒక్క వార్డులో నాలుగు చోట్ల దరఖాస్తులను స్వీకరించే కేంద్రాలను పెట్టానున్నారు. ఈ పథకం అమలు కోసం హైదరాబాద్ కు మంత్రి పొన్న ప్రభాకర్ ను నియమించారు. కాగా దీన్నిపై బంజారాహిల్స్ లోని బంజారాభవన్ లో ప్రజాపాలనపై అధికారులతో రివ్యూ నిర్వహిచారు మంత్రి పొన్నం ప్రభాకర్.
ఒక్కో కౌంటర్‌కు ఒక్కో టీమ్ లీడర్ ఉంటారు. అందులో 7 మంది సభ్యులు ఉంటారు. వార్డులోని ఏ బస్తీ, ఏ కాలనీలో, ఏ రోజు కౌంటర్ ఏర్పాటు చేస్తున్నారన్న దానిపై ముందే సమాచారం ఇస్తారు. ప్రజలు ఎవరు కూడా ఆందోళనకు గురికాకుండా దరఖాస్తు చేసుకోవాలి. మహిళలకు, వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తాం. దరఖాస్తులను నింపేందుకు వాలంటీర్లను కూడా నియమిస్తాం. కౌంటర్ ఏర్పాటు చేసిన నాడు దరఖాస్తు చేసుకోకపోయినా.. వచ్చేనెల 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డుతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం కూడా ఒక సెపరేట్ కౌంటర్ ఏర్పాటు చేశాం’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.
ఆరు గ్యారంటీల దరఖాస్తు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వస్తుంది. ప్రతి కుటుంబం నుంచి అప్లికేషన్లు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌లోని 21 లక్షల మంది ఇండ్లకు అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కౌంటర్ల వద్ద ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతాయన్నారు. ప్రజాపాలన దరఖాస్తు ఫారమ్‌ను నేడు సీఎం ప్రారంభిస్తారని తెలిపారు.