Kedarnath Yatra 2024 : కేదార్‌నాథ్‌ యాత్రలో ప్రమాదం.. కేధార్నాథ్ ట్రెక్కింగ్ లో కొండచరియలు విరిగి ముగ్గురి మృతి

ఉత్తరాఖండ్ కేదార్‌నాథ్‌ యాత్రలో ప్రమాదం చోటు చేసుకుంది. చిద్వాస వద్ద కొండచరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు భక్తులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరు గౌరీకుండ్ నుంచి కేదార్‌నాథ్ ట్రెక్కింగ్ మార్గంలో వెళ్తున్నాట్లు తెలుస్తోంది.

 

ఉత్తరాఖండ్ కేదార్‌నాథ్‌ యాత్రలో ప్రమాదం చోటు చేసుకుంది. చిద్వాస వద్ద కొండచరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు భక్తులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరు గౌరీకుండ్ నుంచి కేదార్‌నాథ్ ట్రెక్కింగ్ మార్గంలో వెళ్తున్నాట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే డిజాస్టర్ మెనేజ్ మెంట్ బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. శిథిలాల నుంచి డెడ్ బాడీలు వెలికి తీశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో మహారాష్ట్ర నాగపూర్ కు చెందిన కిషోర్ అరుణ్ పరాటే ( 31 ), మహారాష్ట్ర జల్నా జిల్లాకు చెందిన సునీల్ మహాదేవ్ కాలీ ( 21 ), రుద్ర ప్రయాగ్ కు చెందిన అనురాగ్ బిస్త్ గా అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేస్తు.. ట్విట్టర్ లో పోస్ట్ ద్వారా సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కాగా గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్ లో వాతావరణ పరిస్థితులు ప్రజలకు అనుకూలంగా లేవు అని చెప్పాలి. ప్రతి సంవత్సరం జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని వర్షాలు, వరదలు ముచ్చెత్తుతాయి. దీంతో ఉత్తరాఖండ్ లోని చోటా చార్ ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు తీవ్ర అవస్తలు ఎదుర్కొంటున్నారు. తాజాగా వారం కిందట బద్రినాథ్ జాతీయ హైవే పై భారీ కొండచరియలు విరిగి పడి తెలంగాణ కు చెందిన ఇద్దరు యాత్రికులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.. కాగా ఇప్పుడు కేదార్నాథ్ ట్రెక్కింగ్ లో ముగ్గురు యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. ఉత్తరాఖండ్ కేధార్ నాథ్ – బద్రినాథ్ ఆలయ కమిటీ ప్రస్తుతం వర్షాలు పడటంతో.. ఎవరు కూడా చార్ ధామ్ యాత్రలు చేయకుండది.. వాతావరణ పరిస్థితులు చూసుకుని యాత్రను చేయాలి విజ్ఞప్తి చేసింది. కాగా కేధార్ నాథ్, బద్రినాథ్, గంగోత్రి, యమునోత్రి యాత్రలు దీపావళి తర్వాత 6 నెలలు మూత బడనున్నాయి ఆలయ కమిటీ తెలిపింది.

Suresh SSM