Second Hand Smart Phone: మన దేశంలో సెకెండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్లకు పెరిగిన గిరాకీ.. కారణం ఇదే

మన దేశంలో సెకెండ్ హ్యండ్ ఫోన్లకు గిరాకీ బాగా పెరుగుతున్నట్లు తాజాగా ఒక సర్వేలో తేలింది. ఈ విషయాన్ని ప్రముఖ కంపెనీ అయిన కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ఒక నివేదికను వెల్లడించింది.

  • Written By:
  • Publish Date - October 19, 2023 / 02:51 PM IST

ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ అంటే అమ్మో అనే వాళ్లం. దీనికి కారణం బోలెడన్ని డబ్బులు ఖర్చు చేయాలనే అభిప్రాయం వినియోగదారుల్లో ఉండేది. కానీ మన్నటి వరకూ అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. ప్రతి ఒక్కరూ కొత్త మొబైల్స్ ను కొనుగోలు చేసేందుకు అలవాటు పడ్డారు. ఇది దశాబ్ధ కాలంగా మార్కెట్ పరిస్థితి. అయితే తాజాగా వెల్లడైన ఒక కంపెనీ నివేదికలో సెకెండ్ హ్యాండ్, రీషర్బిష్డ్ ఫోన్లకు గిరాకీ పెరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 15శాతం అధికంగా అమ్మడైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో దాదాపు 3.5 కోట్ల నుంచి 4.5 కోట్ల కు పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మార్కెట్ నిపుణులు.

తక్కువ ధరలకే మంచి ఫోన్..

ఇక కొత్తగా కొనుగోలు చేసే స్మార్ట్ ఫోన్ల పరిస్థితి అయితే దారుణంగా ఉంది. గతం కంటే అమ్మకాలలో ఐదు శాతం విక్రయాల రేటు తగ్గే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు నిపుణులు. గత ఏడాది 15.1 కోట్ల కొత్త ఫోన్లు అమ్మడుపోయినట్లు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ – జూన్ లో కొత్త ఫోన్ల ఎగుమతులు మూడు శాతం తగ్గినట్లు ఈ నివేదిక తెలిపింది. అయితే జనవరి – మార్చిలో నమోదైన 19శాతం క్షీణతతో పోల్చి చూస్తే కొంచం పుంజుకున్నట్లే కనిపిస్తుంది. ఇలా సెకండ్ హ్యాండ్ ఫోన్ల వైపుకు వినియోగదారుడు ఆకర్షితుడవ్వడానికి ప్రదాన కారణం తక్కువ ధరలకే మంచి ఫోన్లు, తక్కువ కాలం వాడిన ఫోన్లు అందుబాటులో ఉండటం. పైగా అధిక ఫీచర్లు కలిగినవి విక్రయానికి ఉండటంతో ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు వినియోగదారులు.

5జీపై పెరిగిన ఆసక్తి..

ప్రస్తుత జనరేషనల్లో 5జీ ఫోన్ కీలక పాత్ర పోషిస్తోంది. నేటి సమాజంలో ఫోన్ కొనుగోలు చేసేవారు 5జీ టెక్నాలజీకే ఎక్కువగా ఆకర్షితుడవుతున్నాడు. పైగా పండుగల సీజన్లు, ప్రత్యేక ఆఫర్లు పేరిట కొత్త ఫోన్ రీజనబుల్ ఫ్రైస్ లో అందుబాటులో ఉంటే వెంటనే కొనేస్తున్నాడు. దీంతో రెండు లేదు మూడు సంవత్సరాలు వాడిన స్మార్ట్ ఫోన్ ను అమ్మకానిక పెడుతున్నాడు. దీంతో సెకండ్ హాండ్ ఫోన్ల అమ్మకాల శాతం పెరిగిపోయింది. పైగా ఎన్నో ఏళ్ళ క్రితం ఎంట్రీ లెవెల్ ఫోన్ కొనుగోలు చేసిన వారు స్మార్ట్ ఫోన్ కొనేందుకు ఆసక్తిచూపుతున్నారు. దీంతో ప్రతి ఒక్కరి చేతిలో ఫీచర్ ఫోన్లే దర్శనమిస్తున్నాయి. తాజాగా వెల్లడైన లెక్కల్లో మన భారతదేశంలో దాదాపు 80 కోట్ల ఫోన్లు ఉంటే.. వాటిలో 20 కోట్లు ఫీచర్ ఫోన్లే అని నివేదికలో తేటతెల్లమైంది.

T.V.SRIKAR