Flip Models: ఫ్లిప్ మోడల్స్ అంటే ఇండియాలో సూపర్ క్రేజ్.. తాజా సర్వేలో వెల్లడి

మన దేశంలో ఏవైనా సరికొత్త ఎలక్ట్రానిక్ గార్జెట్స్ కొనేందుకు చాలా మంది మక్కువ చూపిస్తారు. అందులోనూ స్మార్ట్ ఫోన్స్ అంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా మనోళ్లు స్మార్ట్ ఫోన్లలో కూడా ఇంకా స్మార్ట్ గా ఆలోచించి ఫ్లిప్ మోడల్స్ ను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - October 23, 2023 / 02:02 PM IST

గతంలో స్మార్ట్ ఫోన్ అంటే కెమెరా క్వాలిటీ ఎంత, బ్యాటరీ లైఫ్ ఎంత అని అడిగే వాళ్లు. కానీ ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. దీంతో పాటూ అభిరుచులు కూడా మారుతూ వచ్చాయి. ఒకప్పటి మోడల్స్ ని యూత్ ఎక్కువగా అట్రక్ట్ అవడం లేదు. కాస్త ధర ఎక్కువైనా లేటెస్ట్ ఫీచర్స్, సరికొత్త మోడల్స్ వైపే అడుగులు వేస్తున్నారు. ఇలాంటి వారిని ఆకర్షించేందుకు ఫ్లిప్ మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇందులో మంచి మార్కెట్ సాధించే దిశగా చైనా కంపెనీలు పావులు కదుపుతున్నాయి. ప్రస్తుతం ఫ్లిప్ ఫోన్లలో శామ్ సంగ్ సరికొత్త ఫీచర్స్ తో తొలి అడగు వేయగా దీనిని ఎదుర్కోవడానికి చైనా కంపెనీలైన లెనోవో, మోటరోలా, టెక్నో, ఒప్పో వంటి కంపెనీలు ముందుకు వస్తున్నాయి.

స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో మొట్టమొదటి సారిగా మోటరోలా రూ. 50 వేల కంటే తక్కువ ధరకు ఫ్లిప్ మోడల్ ను తీసుకొచ్చింది. అయితే కౌంటర్ పాయింట్ సంస్థ చేసిన అధ్యయనంలో మరికొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అక్టోబర్ చివరి వారంలో వన్ ప్లస్ నుంచి ప్రీమియం ఫ్లిప్ ఫోన్ అందుబాటులోకి రానుంది. వన్ ప్లస్ అంటే ప్రస్తుత యువత ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. 2023లో శామ్ సంగ్ ఫ్లిప్ మోడల్ ను విడుదల చేసిన రెండు నెలల్లో సుమారు 50 వేలకు పైగా యూనిట్లను అమ్మినట్లు తెలిసింది. ఇక మోటరోలా, టెక్నో నెలకు 20 వేల యూనిట్ల వరకూ విక్రయించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ సర్వేలో వెల్లడయింది. మంచి బిల్డ్ క్వాలిటీతో, అద్భుతమైన ఫీచర్లు, క్లారిటీతో కూడిన కెమెరాను అందిస్తూ రూ. 50 వేల ధరలో ఒప్పో, టెక్నో కంపెనీలు ఫ్లిప్ మోడల్స్ తీసుకొచ్చినట్లు ఈ నివేదికలో తెలిపింది.

T.V.SRIKAR