Indians Migration: విదేశాలకు వలస వెళ్లడంలో భారత్ నెంబర్ 1.. ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక

ప్రపంచంలో వలసలు వెళ‌ుతున్న దేశంలో భారత్ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2022 లో వెల్లడించింది. ఇంతకు ఈ వలసలు వెళ్ళడానకి కారణాలను తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - September 18, 2023 / 03:01 PM IST

వలసలు ఎక్కువగా రెండు రకాలా కారణాలతో వెళ్తూ ఉంటారు. మొదటిది చదువుకున్న విద్యకు సరైన ఉపాధి అవకాశాలు దొరక్క విదేశాలకు పయనం అవుతూ ఉంటారు. మరికొందరు పాక్షిక నైపుణ్యం కలిగి పెద్దగా చదువుకోని వారు వెళుతూ ఉంటారు. ఇందులోనూ కొన్ని దేశాలకు మాత్రమే వెళ్లడం గమనార్హం. విజ్ఞానం, మేధస్సు కలిగిన వారు అమెరిక, లండన్, ఆస్ట్రేలియా లాంటి నగరాలకు పయనమౌతున్నారు. అదే చిన్న చిన్న ఇంటి పనులు, భవన నిర్మాణ కార్మికులు, కారు డ్రైవర్లు, ఇంటి పనులు చేసే వారు గల్ఫ్ దేశాలకు వెళ్తున్నాట్లు తాజాగా వెలువరించిన అధ్యయనంలో తేలింది.

వలస కార్మికుల్లో వీరే అధికం..

పొరుగు దేశాలకు పయనమౌతున్న వారిలో మనదేశం అగ్రస్థానంలో ఉంది. అందులోనూ దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళే వారే అధికం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక నుంచి అధికంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. 2005లో కేరళ, తమిళనాడు వలసల్లో ఉన్నత స్థానంలో ఉంటే 2012 నాటికి ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు చేటు కల్పించుకున్నాయి. అయితే 2015 అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక ప్రకారం దక్షిణ భారతదేశం కంటే ఉత్తరాది వాళ్లే అధికంగా వలసకు అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆపరిస్థితులు అన్నీ మారిపోయినట్లు ఐక్యరాజ్య సమితి నివేదికల్లో వెలువడింది.

ఎందుకు వలస పోతున్నారు..

ఈ వలసలు ముందుగా సౌత్ ఇండియాలోని నిజామాబాద్ నుంచే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 1970 నాటి పరిస్థితులు చాలా ఘోరంగా ఉండేవి. నక్సలైట్ల ఉద్యమం కారణంగా బిక్కు బిక్కుమని ప్రాణాలు అరచేతిలో ఉంచుకొని బ్రతకాల్సిన పరిస్థితి. వీటికి తెరదించుతూ పొరుగుదేశాలకు ప్రయాణం సాగించారు. ఈ వలసలు ఒకేసారి విదేశాలకు వెళ్లినవి కావు. మన రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అక్కడి నుంచి సర్కిల్ పెంచుకొని ధనార్జన కోసం పొరుగు దేశాలకు పయనమయ్యారు. ఒకే పని జీతాల్లో వ్యత్యాసం ప్రదాన కారణంగా ఉంది. వ్యవసాయానికి భూమి ఉంది తగినంత నీరు లేదు. కరువు కారణంగా వలసలు వెళ్లారు. ఈ పరిస్థితి క్రమక్రమంగా రాయలసీయ, కోస్తా, ఉత్తరాంధ్రాలోని కొన్ని జిల్లాల్లో స్పష్టంగా కనిపించింది. పొరుగు రాష్ట్రాలకు, దేశాలకు వెళ్లిన వారు అక్కడి పరిస్థితులను ఇక్కడి వారికి వివరించడంతో మరిన్ని వలసలు పెరిగాయి.

మన తరువాత వలస వెళ్తున్న దేశాలు ఇవే..

భారతదేశంలో రోజు రోజుకూ వలసలు వెళ్తున్న వారి సంఖ్య అధికమవడానికి కారణం ప్రపంచం వేగంగా విస్తరించడం అంటున్నారు గ్లోబల్ టెక్ నిపుణులు. మన దేశంలో చేసే పని కంటే ఇతర దేశాల్లో చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సరైన పని సమయం, అధిక ఒత్తిడి లేకపోవడం, స్నేహశైలి ఇవన్నీ వెరిసి పరాయిదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే అక్కడ బాగా సంపాధించి ఇక్కడ జీవిత కాలం స్థిరపడదామని కూడా వెళ్తున్నారు. తాజాగా ఐక్యరాజ్యసమితి వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2022 ను వెల్లడించింది. అందులో మన దేశం నుంచి 1.8 కోట్ల మంది వెళ్లి మొదటి స్థానంలో నిలిచింది. అందులోనూ UAEలో నివసిస్తున్న వారి సంఖ్య 34.71 లక్షలు కాగా అమెరికాలో 27.23 లక్షల మంది నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇతర దేశాలైన మెక్సికో 1.12 కోట్లతో రెండవ స్థానంలో నిలువగా.. రష్యా నుంచి 1.08 కోట్ల మంది పొరుగు దేశాలకు వెళ్లారు.

T.V.SRIKAR