Vikram Lander: చంద్రయాన్-3 కి అన్నీ మంచి శకునములేనా..?

చంద్రయాన్ 3 చంద్రడిపై సురక్షితంగా ల్యాండ్ అవడానికి మరి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

  • Written By:
  • Updated On - August 23, 2023 / 10:38 AM IST

చంద్రయాన్ ఈ పేరు ఇప్పుడు యావత్ భారతం జపిస్తున్న మంత్రం. ఇక ప్రపంచం అయితే కళ్లు కాయలు కాసేలా వేచిచూస్తోంది. గతంలో ఎన్ని సార్లు చంద్రుడి పైకి వెళ్లాలని ప్రయత్నాలు చేసినా అన్నీ ఆదిలోనే హంసపాదం అనేలా బెడిసికొట్టాయి. గతంలో చంద్రయాన్ 2 అడుగు దూరంలో విఫలం అయింది. తాజాగా ప్రవేశ పెట్టిన చంద్రయాన్ 3 ప్రతి దశలోనూ విజయవంతంగా దూసుకుపోతూంది. దీనిని బట్టి విక్రమ్ ల్యాండర్ కి మంచి శకునము ప్రారంభమైందా.. ఇక చంద్రుడిపై అడుగు పెట్టిన వాళ్ల జాబితాలో ఇండియా కూడా చోటు సంపాదించుకుంటుందా అనేలా చర్చ మోదలైంది. ఇప్పటి వరకూ చంద్రయాన్ భూమిపై నుంచి అంత్యరిక్షంలోకి ఎగిరే వరకూ.. అంత్యరిక్ష్యంలో వెళ్లి తనను తాను విడిభాగాలుగా విచ్ఛిన్నం చేసుకునే వరకూ.. విచ్ఛిన్నం చేసుకోవడం మొదలు అక్కడి పరిస్థితులను ఫోటోలు తీసి పంపించడంలో ఎక్కడా ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తకుండా విజయవంతంగా దూసుకెళ్లింది.

మండలం రోజుల్లో చంద్రమండలంపై సాధించిన విజయాలు ఇవే..

  • శ్రీహరి కోటలోని భారత అంత్యరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి ప్రయాణానికి ఏర్పాట్లు వేగంతంగా పూర్తిచేసుకోవడం
  • జూలై 14న చంద్రయాన్ ప్రయోగానికి సిద్దమై అగ్నికీలలు కక్కుకుండూ నింగిలోకి దూసుకెళ్లడం
  • 41 రోజుల్లో భూమధ్యంతర కక్ష్యలో ఐదు సార్లు ప్రయాణం చేయడం
  • మరో ఐదు సార్లు లూనార్ ఆర్బిట్ వలయంలో అంటే చంద్రుడి కక్ష్యలో తిరగడం
  • ఇలా ఎన్ని సార్లు కక్ష్య దూరం పెంచినా పట్టు సడలకుండా చివరకి చంద్రమండలాన్ని చేరడం
  • ఈనెల 17న ప్రొపల్షన్ మాడ్యూల్ ల్యాండర్ మాడ్యూల్ వేరుగా ఏర్పడి చంద్రుడి దగ్గరగా వదిలిపెట్టడం
  • ల్యాండర్ మాడ్యూల్ లోని ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా అద్భుతమైన పనితీరు కనబరచడం
  • దాదాపు 70 కిలో మీటర్ల దూరం నుంచే చంద్రుడి ఉపరితలాన్ని ఫోటోలు తీసి పంపించడం
  • ఇక మిగిలింది చంద్రుడి ఉపరితలం పై సురక్షితంగా అడుగుపెట్టడమే.

ఇన్ని ఘట్టాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ ఆఖరి మజిలీని కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఆశిస్తున్నారు శాస్త్రవేత్తలు. దీనికి తగ్గట్టుగా ప్రోగ్రామింగ్ చేసి అందులో అప్లోడ్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇన్ని ప్రక్రియలలో సఫలీకృతం చెందిన ల్యాండర్ చివరి అంకంలోనూ విజయం సాధిస్తుందా లేదా అంటే ఈ రోజు సాయంత్రం వరకూ వేచి చూడక తప్పదు.

T.V.SRIKAR