పవన్ కల్యాణ్ తర్వాత.. రఘురామే ! ఈ ఎన్నికల్లో ఎవరి గురించైనా భారీగా చర్చ జరిగింది.. ఈ ఇద్దరి గురించే ! గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి.. జగన్‌కు ఎదురుతిరిగి, తిరుగుబాటు జెండా ఎగురవేసి.. చివరికి లాఠీదెబ్బలు తిన్న రఘురామ.. వైసీపీ మీద, జగన్ మీద కోపంతో రగిలిపోయారు. సరిగ్గా ఎన్నికల ముందు టీడీపీలో చేరి.. చాలారోజుల సస్పెన్స్ తర్వాత సీటు సంపాదించి.. ఎమ్మెల్యేగా గెలిచారు. కాదు కాదు.. ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా మెట్టు దిగిపోయారు. వచ్చేది కూటమి ప్రభుత్వమే.. కాబోయే స్పీకర్ నేనే అంటూ.. ఫలితాల ముందు డబ్బా కొట్టి మరీ తనకు తాను ప్రచారం చేసుకున్న రఘురామకు.. షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. ఎమ్మెల్యేగా మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ మీద తిరుగుబాట చేశాక.. ఫేస్‌బుక్ లైవ్‌లో మాత్రమే కనిపించేవారు రఘురామ.
ఇప్పుడు ఉండి నుంచి గెలిచిన తర్వాత.. ఆయన చేయాల్సింది, చేయబోయేది అదే అన్నట్లు సీన్ మారింది. మూడు పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేయడంతో.. పదవుల పంపకాలు చంద్రబాబు ఇబ్బందిగా మారింది. సీనియర్లకు కూడా మొండిచేయి చూపించాల్సి వచ్చింది. గంటా, అయ్యన్న, పరిటాల సునీత, బండారులంటి సీనియర్ నేతలకు కూడా మంత్రి పదవులు దగ్గలేదు. ఇంత పోటీ మధ్య రఘురామ ఏదో పదవి ఆశించారు. ఐతే ట్రిపులార్‌కు మొండిచేయే కనిపిస్తోంది. రఘురామకు చివరికి మిగిలింది, మిగిలేది ఎమ్మెల్యే సీటు మాత్రమే. ఎంపీ నుంచి ఎమ్మెల్యేకు పడిపోయిన రఘురామకృష్ణరాజు… మూడేళ్ల పాటు జగన్‌కి వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో యుద్ధం చేశారు. ఆ తర్వాత మళ్లీ ఎంపీ అవుదామని అనుకున్నా.. ఈయనను ఎక్కడ భరిస్తామని బీజేపీ దూరం పెట్టింది. చివరికి చంద్రబాబుతో దయతో ఉండి నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.
నిజానికి బీజేపీ నుంచి నరసాపురం ఎంపీగా పోటీ చేద్దామని.. రఘురామ ప్లాన్ చేశారు. మనోడి న్యూసెన్స్ ముందు కనిపెట్టిన కమలం పార్టీ అధిష్టానం.. జగన్ విన్నపాలను మన్నించి మరీ.. రఘురామను దూరం పెట్టింది. నరసాపురం ఎంపీ సీట్ ఇవ్వలేదు. చివరికి చంద్రబాబు కాళ్లవేళ్లా పడితే.. చట్టసభల్లో అడుగు పెట్టే చాన్స్ దక్కింది. అప్పటికే ఉండి స్థానానికి రామరాజును అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు.. ఆయనను బతిమిలాడి మరీ రఘురామకు టికెట్ ట్రాన్స్‌ఫర్ చేశారు. ఎమ్మెల్సీ హామీ ఇచ్చి రామరాజును ఒప్పించిన చంద్రబాబు.. రఘురామకు ఉండి టికెట్ ఇప్పించారు. ఎమ్మెల్యేగా గెలవగానే తనను స్పీకర్ చేస్తారని… అసెంబ్లీలో జగన్‌ను ఓ ఆట ఆడుకుంటానని రఘురామ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఐతే అదీ దక్కలేదు. పోనీ రాజుల కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు.
ఆ ఆశ కూడా తుస్సుమంది. వీటన్నింటికి మించి.. చంద్రబాబు ఇచ్చిన షాక్.. రఘురామ లోలోపల రగిలిపోయేలా చేస్తోందని టాక్. మంత్రిపదవి ఏది, స్పీకర్ పదవి ఎక్కడ అని రఘురామ కోరికల చిట్టా బయటపెట్టగా.. చంద్రబాబు గట్టిగానే ఆన్సర్ ఇచ్చారని తెలుస్తోంది. ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి చాలా త్యాగాలు చేయాల్సి వచ్చింది… ఇంతకుమించి ఆశించొద్దు అంటూ రఘురామకు చంద్రబాబు గట్టిగానే చెప్పారట. బీజేపీ దూరం పెడితే.. టికెట్ ఇచ్చేది లేదని మొహం మీద చెప్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కనపెట్టి సీటు ఇచ్చామని.. ఇక్కడితో సర్దుకొని తృప్తిపడితే మంచిదని వార్నింగ్ కూడా ఇచ్చారట చంద్రబాబు.
దీంతో ఇప్పుడు రఘురామకు గట్టి షాక్ తగినట్లు అయింది. పదవి లేదు.. బొక్క లేదు.. ఇక లైవ్‌లో పిసుక్కోవడమే అని సోషల్ మీడియాకే పరిమితం అవాలని ఫిక్స్ అయ్యారట. అందుకే రోజూ ఫేస్‌బుక్ లైవ్‌లో వస్తున్న రఘురామ.. ఉండిని బాగుచేద్దాం అంటూ.. సాయాలు కోరుతున్నారు. అంతన్నాడు.. ఇంతన్నాడు.. చివరికి ఇలా పిసుక్కుంటున్నాడు రఘురామ పాపం అని.. సోషల్ మీడియాలో జనాలు జాలి చూపిస్తున్న పరిస్థితి.