Congress party : కాంగ్రెస్‌కు షాక్‌.. బీఆర్ఎస్‌లోకి జిట్టా..!

ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత.. కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. రేవంత్‌కు మరీ ముఖ్యంగా ! సింగిరెడ్డి, రాగిడి, హర్షవర్ధన్ రెడ్డి లాంటి వాళ్లు రేవంత్‌ సంగతేందో చూస్తామని సవాల్ విసురుతుంటే.. టికెట్ దక్కని నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇప్పుడు జిట్టా రూపంలో కాంగ్రెస్‌కు అలాంటి షాకే తగిలింది.

ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత.. కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. రేవంత్‌కు మరీ ముఖ్యంగా ! సింగిరెడ్డి, రాగిడి, హర్షవర్ధన్ రెడ్డి లాంటి వాళ్లు రేవంత్‌ సంగతేందో చూస్తామని సవాల్ విసురుతుంటే.. టికెట్ దక్కని నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇప్పుడు జిట్టా రూపంలో కాంగ్రెస్‌కు అలాంటి షాకే తగిలింది. భువనగిరి నుంచి టికెట్ ఆశించిన జిట్టాకు.. నిరాశే మిగిలింది. దీంతో హస్తానికి హ్యాండ్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కీల‌క‌మైన నాయ‌కుడిగా గుర్తింపు పొందిన జిట్టా బాల‌కృష్ణా రెడ్డి.. ఉన్నట్టుండి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. భువనగిరి నుంచి త‌న‌కు టికెట్ వ‌స్తుంద‌ని ఆశించారు. రాకపోవ‌డంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రక‌టించారు.

బీజేపీలో జిట్టాను సస్పెండ్ చేస్తే.. ఆయన కాంగ్రెస్‌లో చేరారు. టికెట్ హామీ మీదే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఐతే ఫస్ట్ లిస్ట్‌లో జిట్టా పేరు లేదు. దీంతో ఆయన మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయిన 20మంది నేత‌ల‌కు టికెట్లు దక్కాయి.. జిట్టాకు మాత్రం అవకాశం లేకుండా పోయింది. ఉద్యమ‌కారుడిగా జిట్టా బాల‌కృష్ణా రెడ్డికి మంచి పేరుంది. కాంగ్రెస్‌లో ఎదురుదెబ్బ తగలడంతో.. ఆయన ఇప్పుడు కారు వైపు చూస్తున్నారని తెలుస్తోంది. ఎంపీ లేదా ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని జిట్టాకు గులాబీ పార్టీ హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీలో చేరేందుకు అంగీకరించినట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. భువనగిరిలో జరగనున్న సీఎం కేసీఆర్ ఎన్నికల సభలో.. జిట్టా బాలకృష్ణారెడ్డి గులాబీ కండువా కప్పుకునే చాన్స్ ఉంది.