REVANTH GOVT : ఎన్నికల తర్వాత.. రేవంత్ సర్కార్ కూలుతుందా ?

లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ కూలుతుందా ? బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా ?

లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ కూలుతుందా ? బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా ? మొన్న లక్ష్మణ్, కిషన్ రెడ్డి (Kishan Reddy)… నిన్న హరీష్ రావు అన్న మాటలకు అర్థం ఏంటి ? అందుకేనా రేవంత్ కొడంగల్ లో రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సొంత పార్టీ నేతల నుంచి కంటే… బయటి పార్టీల లీడర్ల నుంచే ముప్పు పొంచి ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణలో కాస్త తక్కువ మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ… బీజేపీ, బీఆర్ఎస్ నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి. రేవంత్ రెడ్డి దిగిపోతారనీ… కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆ పార్టీల నేతలు. అలా కామెంట్ చేసిన కడియం శ్రీహరి లాంటి వాళ్ళు మళ్ళీ అదే కాంగ్రెస్ లో చేరారు. కానీ బీజీపీ ఎంపీ లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి… మాజీ మంత్రి హరీష్ రావు లేటెస్ట్ గా కూడా ఇదే కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ఈ రెండు పార్టీలు కలసి లోక్ సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ ను కూలగొడతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని లక్ష్మణ్ అంటుంటే… ఆరు నెలలు తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇక హరీశ్ రావు అయితే… లోక్ సభ ఎన్నికల తర్వాత మళ్ళీ కేసీఆరే సీఎం అవుతారనీ… త్వరలోనే మన ప్రభుత్వం వస్తోందని కామెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనూ ఐదేళ్ళు పూర్తిగా పాలించలేదనీ… ఆ పార్టీ నేతలే సెల్ఫ్ గోల్ చేసుకుంటారని సిద్ధిపేట ఎన్నికల ప్రచార సభలో అన్నారు హరీష్ రావు.

కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి… ఈ రెండు పార్టీలపై మాట్లాడారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అడ్డదారిలో కూల్చాలని చూస్తే… జనం చూస్తూ ఊరుకోరని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడాన్ని చూస్తుంటే… ఎన్నికల తరువాత తెలంగాణలో ఏదో జరగబోతోందన్న సంకేతాలు జనంలోకి వెళ్తున్నాయి. పైగా రేవంత్ రెడ్డి కుట్ర సిద్ధాంతం గురించి చెప్పడం… గూడపు ఠాణీ, కుట్ర, పన్నాగం లాంటి పదాలు వాడటంతో కాంగ్రెస్ లీడర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. గతంలో ఇలాంటి కామెంట్లపై గట్టిగా రియాక్ట్ అయిన రేవంత్… కొడంగల్ లో ఆ స్థాయిలో తన వాయిస్ ని పెంచలేదని అంటున్నారు.