Vishal: రాజకీయాల్లోకి మరో తమిళ స్టార్.. కొత్త పార్టీ పెట్టబోతున్న విశాల్..

ఆదివారం చెన్నైలో జరిగిన ఒక ప్రెస్‌మీట్‌లో విశాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కొత్త పార్టీ పెట్టి, రాజకీయాల్లోకి రాబోతున్నట్లు చెప్పారు. పార్టీని స్థాపించి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాన్నారు.

  • Written By:
  • Updated On - April 14, 2024 / 08:57 PM IST

Vishal: తమిళ స్టార్ హీరో విశాల్ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. ఆదివారం చెన్నైలో జరిగిన ఒక ప్రెస్‌మీట్‌లో విశాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కొత్త పార్టీ పెట్టి, రాజకీయాల్లోకి రాబోతున్నట్లు చెప్పారు.

Pawan Kalyan: పవన్‌పై రాయితో దాడి.. తప్పిన ప్రమాదం

పార్టీని స్థాపించి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాన్నారు. ‘‘ప్రస్తుతం ప్రజలకు సరైన వసతుల్లేవు. వారికి సేవ చేసి.. అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నా’’ అని ప్రకటించారు. తాను ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశం లేదన్నాడు. ముందుగా తనను తాను నిరూపించుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. ఆ తర్వాతే మిగిలిన విషయాల గురించి ఆలోచిస్తానన్నాడు. కాగా.. పార్టీ ఎప్పుడు స్థాపించేది.. పేరు.. వంటి వివరాలేవీ విశాల్ చెప్పలేదు. తమిళంతోపాటు తెలుగులోనూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్‌కు రాజకీయాలు, సామాజిక అంశాలపై ఆసక్తి ఎక్కువే. అనేక అంశాలపై ఎప్పుడూ స్పందిస్తూనే ఉంటారు. గతంలో ఒకసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తన అమ్మ పేరుతో స్థాపించిన దేవి ఫౌండేషన్ ద్వారా విశాల్ సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

నిరుపేద విద్యార్థులు, బాధిత రైతులకు సాయం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జనం కష్టాలు తెలుసుకుంటు, పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు విశాల్. ఇటీవలే మరో తమిళ స్టార్ దళపతి విజయ్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయ్ కూడా తమిళనాట వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే, ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలకు మాత్రం దూరంగా ఉన్నారు.