Wings India 2024: ఆకాశమే హద్దు.. ఇలాంటి ఎయిర్‌ షో ఎప్పుడూ చూసి ఉండరు..

జనవరి 21 వరకూ కొనసాగనున్న ఈ ఏవియేషన్‌ షోలో.. 106 దేశాలకు చెందిన 15 వందల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. శని ఆదివారాల్లో సందర్శకులను అనుమతిస్తామని చెప్పడంతో.. ఏవియేషన్‌ షో చూసేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో వచ్చారు.

  • Written By:
  • Publish Date - January 20, 2024 / 07:20 PM IST

Wings India 2024: హైదరాబాద్‌లోని బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ వేదికగా వింగ్స్‌ ఇండియా–2024 ఏవియేషన్ షో అట్టహాసంగా కొనసాగుతోంది. విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఏవియేషన్‌ షో ను.. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి చాలా గ్రాండ్‌గా ఏవియేషన్‌ షో ఏర్పాటు చేశారు. 106 దేశాలకు చెందిన 25 రకాల విమానాలను ప్రదర్శన ప్రదర్శనలో ఉంచారు. జనవరి 21 వరకూ కొనసాగనున్న ఈ ఏవియేషన్‌ షోలో.. 106 దేశాలకు చెందిన 15 వందల మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

Ayodhya : అయోధ్యలో బాలరాముడి ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?

శని ఆదివారాల్లో సందర్శకులను అనుమతిస్తామని చెప్పడంతో.. ఏవియేషన్‌ షో చూసేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కేవలం హైదరాబాద్‌ నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి ప్రేక్షకులు బేగంపేట్‌కు చేరుకున్నారు. అందుకు తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. సందర్శకుల కోసం ఫుడ్‌ కోర్టులు కూడా ఏర్పాటు చేసింది. ఈ మొత్తం ఏవియేషన్‌ షోకు బోయింగ్‌ 777 ఎక్స్‌ ప్రత్యేకంగా నిలిచింది. ఈ విమానాన్ని సందర్శనకు ఉంచడం ఇదే తొలిసారి. గతంలో ఎప్పుడు ఏ షోలో ఈ విమానాన్ని ప్రదర్శించలేదు. ఇక ఇవే కాకుండా ప్రముఖ హెలికాప్టర్‌ తయారీ సంస్థలు అగస్తా వెస్ట్‌ల్యాండ్‌, బెల్‌ హెలికాప్టర్స్‌, రష్యన్‌ హెలికాప్టర్స్‌, ఎయిర్‌బస్‌ హెలికాప్టర్స్‌ ప్రదర్శనలో ఉంచారు. విజిటర్స్‌ కోసం ప్రత్యేకంగా ఎయిర్‌ షో నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే ఏరోబాటిక్స్‌ చేసే ఏకైక జట్టుగా పేరొందిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్‌ టీం.. ఈ ఏవియషన్‌ షోలో విన్యాసాలు నిర్వహిస్తోంది. సారంగ్ టీం విన్యాసాలు ప్రత్యక్షంగా చూసేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు ఏవియేషన్ షోకు వస్తున్నారు. హెలికాఫ్టర్లతో ఈ టీం చేసే విన్యాసాలు చూసేందుకు రెండు కళ్లు సరిపోవు.

గ్లోబల్‌ టీంగా పేరున్న మరో టీం కూడా తమ జెట్‌ విమానాలతో విన్యాసాలు అదరగొట్టింది. గాలిలో రోల్స్‌ కొడుతూ విజటర్స్‌ను త్రిల్‌ చేసింది. ఈ జెట్‌ విమానాలతో గ్లోబల్‌ టీం చేసే విన్యాసాలు గురించి చెప్పడం కంటే చూస్తేనే బాగుంటుంది. ఈ షోలో ప్రత్యేకంగా మ్యూజిక్‌ కన్సర్ట్‌ కూడా ఏర్పాటు చేశారు. ప్రముఖ మ్యూజీషియన్‌ శివమణి.. ఎయిర్‌పోర్ట్‌లో లైవ్‌ కన్సర్‌ ఇచ్చారు. మొత్తం ఏవియేషన్‌ షోకు బోయింగ్‌ 777ఎక్స్‌, గ్లోబల్‌ స్టార్‌ విన్యాసాలు, శివమణి కన్సర్ట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తం నాలుగు రోజులు ఏర్పాటు చేసిన ఈ షోలో మొదటి రెండు రోజులు కేవలం వ్యాపార, వాణిజ్య వేత్తలకు అవకాశం ఇవ్వగా.. ఆ తరువాత రెండు రోజులు సామాన్యులకు అవకాశం కల్పించారు. అయితే సాధారణ సందర్శకులు 750 రూపాయల టిక్కెట్టు తీసుకుని ఏవియేషన్ షోకు వెళ్లాల్సి ఉంటుంది. ‘బుక్‌మైషో’ యాప్‌లో నిర్వాహకులు టికెట్లను అందుబాటులో ఉంచారు. అయితే 30 అడుగుల దూరంలో బారికేడ్ల నుంచి మాత్రమే ఎగ్జిబిషన్‌లో ఉంచిన విమానాలను సందర్శకులు చూసే అవకాశం ఉంటుంది.