ఎయిర్ ఇండియా తన ప్రయాణీకులను దృష్టిలోఉంచుకొని తక్కువ ధరతో త్వరగా, సౌకర్యవంతంగా ప్రయాణాలు చేసేందుకు వెసులు బాటు కల్పించింది. అందులో భాగంగా సరికొత్త ఆఫర్లను, వాటి ధరలను ప్రకటించింది. దీనికి కాలపరిమితిని విధించింది. ఈ ఆదివారం అంటే ఆగస్ట్ 20 అర్థరాత్రి 11.59లోపూ మీరు ఏ ప్రాంతానికైనా ప్రయాణ టికెట్ ను బుక్ చేసుకోవాలిని షరతు పెట్టింది. ఇలా రిజర్వేషన్ చేసున్న వారికి ప్రారంభ ధర రూ. 1470 గా నిర్ణయించింది. అదే బిజినెస్ క్లాస్ టికెట్ అయితే రూ. 10,130 గా నిర్ణయించింది. సెప్టెంబర్, అక్టోబర్ లో పెళ్లిళ్ళు, పండుగలు ఎక్కువగా ఉన్న కారణంగా ఈ అవకాశాన్ని కల్పించింది. అలాగే ఈ ఆఫర్ ను సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 లోపు ప్రయాణించేవారికి మాత్రమే వర్తించనున్నట్లు తెలిపింది. ఇది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు కూడా రాయితీ లభిస్తుందని ఎయిర్ ఇండియా తన ప్రకటనలో పేర్కొంది.
టికెట్లతోపాటూ మరిన్ని వివరాల కోసం అధికారికి వెబ్ సైట్ airinida.com లోకి వెళ్ళాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లో మొబైల్ యాప్ ద్వారా కూడా టికెట్లను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. రిటర్న్ టికెట్స్ కూడా ఒకే సారి బుక్ చేసుకునే వారికి మరింత ప్రయోజనం కలిగేలా ప్రయాణీకులకు డబుల్ లాయల్టీ బోనస్ పాయింట్లను అందించనున్నట్లు పేర్కొంది. ఈ ప్రత్యేకమైన ఆఫర్లను ప్రయాణీకులు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఇలాంటి ఆఫర్లు ప్రకటించడం వల్ల ఎయిర్ ఇండియా రానున్న రోజుల్లో ఎక్కువ మంది ప్రయాణీకులను ఆకర్షించేందుకు దోహదపడుతుందని వ్యాపార నిపుణులు అశాభావం వ్యక్తం చేస్తున్నారు.
T.V.SRIKAR