Airtel Wifi: దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ టెల్ 5జీ వైర్ లెస్ వైఫై.. దీని ధర ఎంతో తెలుసా..?

నేటి యుగం మొత్తం సాంకేతికత వైపే ఆధారపడి ఉంది. దీనికి తగన డేటా సామర్థ్యాన్ని అందించేందుకు అనేక సంస్థలు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగానే మన్నటి వరకూ 4జీ సేవలను అందిస్తున్న మొబైల్ నెట్వర్క్ సంస్థలు 5జీ వైపుకు అడుగులు వేశాయి. అయితే ఈ 5జీలో మరింత ఆధునికతను జోడిస్తూ 5జీ ఫిక్స్డ్ వైర్ లెస్ యాక్కెస్ ను ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ ఎయిర్ ఫైబర్ పేరుతో లాంజ్ చేసింది.

  • Written By:
  • Publish Date - August 13, 2023 / 02:35 PM IST

భారతీయ దిగ్గజ టెలికాం సంస్థకి చెందిన ఎయిర్ టెల్ తాజాగా ఒక ప్రకటనలో తన ఇంటర్ నెట్ డివైజ్ ను పరిచయం చేసింది. ఫైబర్ ఉపయోగించి అంటే తీగల ద్వారా ఏదైనా ప్రాంతంలో ఇంటర్ నెట్ సేవలు అందించాలంటే కొన్ని సార్లు చాలా కష్టంగా మారుతుంది. అందుకే ఈ వైర్ లెస్ ఇంటర్నెట్ డివైజ్ ను తీసుకొచ్చినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ సేవలు ముంబై, ఢిల్లీకి మాత్రమే పరిమితంకాగా రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా ప్రదాన నగరాల్లో, పట్టణాల్లో అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది. దీనిని తీసుకురావడానికి గల కారణాలను కూడా వివరించింది. గడిచిన మూడు సంవత్సరాలుగా ప్రతి ఇంట్లో ఇంటర్ నెట్ వినియోగం తప్పని సరి అయిపోయిందని దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ 5జీ డివైజ్ ను తయారు చేసినట్లు తెలిపారు.

ఇప్పటి వరకూ మన దేశంలో 3.4 కోట్ల ఇళ్లలో మాత్రమే కేబుల్ ద్వారా ఇంటర్ నెట్ ను అందిస్తున్నామని తెలిపారు. మరికొంత మందికి ఈ సేవలు అందించాల్సి ఉందని కానీ ఫైబర్ కనెక్షన్ ఇవ్వలేని కారణంగా వాళ్లు ఇంటర్ నెట్ ను వినియోగించుకోలేక పోతున్నారని తెలిపింది. అందుకే ఈ 5జీ వైర్ లెస్ వైఫై డివైజ్ ను తీసుకొచ్చామని కంపెనీ యాజమాన్యం తెలిపింది. దేశంలోనే ఇది మొట్టమొదటి వైర్ లెస్ 5జీ వైఫై అని తెలిపింది. గ్రామీణ, మండల స్థాయి ప్రాంతాల్లో కూడా ఫైబర్ అవసరం లేకుండా దీని సహాయంతో డేటా అందిస్తామని వివరించారు. దీనికి సంబంధించిన ప్లాన్ వివరాలుకూడా వెల్లడించారు. ఆరు నెలలకు గానూ రూ. 799 చెల్లించాల్సి ఉంటుంది. దీనికి 100 ఎంబీపీఎస్ స్పీడ్ తో డేటా పొందవచ్చు. అయితే ఈ డివైజ్ కావాలనుకునే వారు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 2500 చెల్లించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ నెట్వర్క్ అవసరం లేదనుకుంటే డివైజ్ తీసుకెళ్లి మన డబ్బలు తిరిగి రీఫండ్ చేస్తారు.

T.V.SRIKAR