పరిహారం తప్పదా ? జడ్జి ముందు నాగార్జున వాగ్మూలం సురేఖ 100 కోట్లు కట్టాల్సిందేనా?

సమంత నాగచైతన్య గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లోనే కాకుండా సినీ ఇండస్ట్రీలో రచ్చ లేపాయి. ఒక మంత్రి స్థానంలో ఉండి సామాన్యులు కూడా వాడని భాషను భావాన్ని వాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలపై సినీ లోకం మొత్తం సీరియస్‌ అయ్యింది.

  • Written By:
  • Publish Date - October 8, 2024 / 04:25 PM IST

సమంత నాగచైతన్య గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లోనే కాకుండా సినీ ఇండస్ట్రీలో రచ్చ లేపాయి. ఒక మంత్రి స్థానంలో ఉండి సామాన్యులు కూడా వాడని భాషను భావాన్ని వాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలపై సినీ లోకం మొత్తం సీరియస్‌ అయ్యింది. ఇటు బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా లేడీ మంత్రికి గట్టిగానే ఇచ్చిపడేసింది. దీంతో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం కొండా సురేఖ చేసినప్పటికీ నాగార్జున మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ కోర్టు వరకూ వెళ్లారు. తన కుటుంబాన్ని అవమానించేలా మంత్రి మాట్లాడిందంటూ కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ కేసులో ఇప్పటికే నాంపల్లి కోర్టు జడ్జి విచారణ జరిపారు. కేసులో తీర్పు కోసం పిటిషనర్‌తో పాటు సాక్ష్యుల వాగ్మూంలం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని.. నాగార్జున కోర్టుకు రావాలని ఆదేశించారు.

దీంతో ఇవాళ మధ్యాహ్నం నాంపల్లి కోర్టుకు నాగార్జున హాజరు అయ్యారు. ఇదే పిటిషన్‌పై మంత్రి తరఫు లాయర్లు కూడా గట్టిగానే వాదిస్తున్నారు. మంత్రి మాట్లాడింది ఒకటైతే బీఆర్ఎస్‌ సోషల్‌ మీడియా వేరే విధంగా ప్రొజెక్ట్‌ చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోందని ఆరోపిస్తున్నారు. ఇక నాగార్జున కూడా పరువునష్టం దావా వేయడ కరెక్ట్‌ కాదని వాదిస్తున్నారు. ఇప్పుడున్న వివాదం సరిపోదన్నట్టు.. బిగ్‌బాస్‌ లాంటి షో చేస్తున్న నాగార్జున పరువు గురించి మాట్లాడుతున్నారు అంటూ విమర్శలు కూడా చేస్తున్నారు. స్వయంగా లాయర్లే ఇలాంటి కామెంట్స్‌ చేయడంతో ఈ కేసు మరింత వివాదాస్పదంగా మారింది. ఇలాంటి తరునంలో నాగార్జున ఇప్పటికే తన వాంగ్మూలం ఇవ్వడంతో కోర్ట్ తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.