Alapati Raja: టీడీపీ మూడో లిస్ట్ వచ్చేసింది. సీనియర్లు చాలామందిని పక్కన పెట్టేశారు. గంటా, దేవినేని ఉమా, ఆలపాటి రాజాలాంటి వాళ్ల పేర్లు జాబితాలో కనిపించలేదు. టికెట్ ఆశించి భంగపడిన నేతలు.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీలోనే కాదు.. సైకిల్ పార్టీ అనౌన్స్‌మెంట్ తర్వాత జనసేన, బీజేపీలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. టికెట్లు దక్కని నేతలు పార్టీ వీడటానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
Devara : ‘దేవర’ వీడియో లీక్.. షాక్ లో మూవీ టీమ్
సర్వేలు, వలసలు.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని టికెట్లు అనౌన్స్ చేశామని టీడీపీ పెద్దలు చెప్తున్నా.. తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తి తగ్గడం లేదు. ఉమ్మడి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో అసంతృప్తులు ఎక్కువగా కనిపిస్తున్నారు. గుంటూరు జిల్లాలో కీలకం అయిన తెనాలి స్థానాన్ని.. కూటమిలో భాగంగా జనసేనకు కేటాయించింది టీడీపీ. జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ పోటీ చేయబోతున్నారు. ఐతే మార్పులు, చేర్పులు ఉంటాయని.. కచ్చితంగా తనకే సీటు దక్కుతుందని.. లేదంటే వేరే నియోజకవర్గం అయినా ఇస్తారని హోప్స్ పెట్టుకున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.. ఆశలు అడియాశలుగా మిగిలాయ్. తెనాలి సీటు జనసేనకు కేటాయించిన తర్వాత.. రాజాకు ప్రత్యామ్నాయం చూపిస్తామని చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఐతే అలాంటిదేమీ జరగకపోవడంతో.. ఆలపాటి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.
టికెట్ రాకపోవడంతో ఇక భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని రాజా భావిస్తున్నారు. ఆత్మీయులతో సమావేశం కాబోతున్నారు. ఆయన టీడీపీని వీడడం.. దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అభిమానులు, కార్యకర్తల సమక్షంలోనే పార్టీ మార్పు, భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఒకవేళ టీడీపీకి గుడ్ బై చెప్పాల్సి వస్తే.. ఏ పార్టీలో చేరతారు.. బీజేపీలోకి వెళ్తారా లేకుంటే వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా అనేది ఆసక్తిగా మారింది.