CRICKETOR POST : అందరి దృష్టి పాకిస్తాన్ లో హిందువులపైనే.. క్రికెటర్ రాహుల్ పోస్ట్ వైరల్

టీమిండియా (Team India) క్రికెటర్ (Cricketer), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) స్టార్ ప్లేయర్ (Star Player) రాహుల్ (Rahul) తెవాటియా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. మన దేశంలో సెలబ్రిటీలంతా పాలస్తీనాకు సపోర్ట్ గా అందరి కళ్ళూ రఫాపైనే ఉన్నాయి అనే పోస్టును షేర్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఈ ఉద్యమం నడుస్తోంది.

టీమిండియా (Team India) క్రికెటర్ (Cricketer), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) స్టార్ ప్లేయర్ (Star Player) రాహుల్ (Rahul) తెవాటియా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. మన దేశంలో సెలబ్రిటీలంతా పాలస్తీనాకు సపోర్ట్ గా అందరి కళ్ళూ రఫాపైనే ఉన్నాయి అనే పోస్టును షేర్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఈ ఉద్యమం నడుస్తోంది. కానీ తెవాటియా మాత్రం అందరి దృష్టీ పాకిస్తాన్ లోని హిందువులపై ఉంది. అంటూ ఇన్ స్టా గ్రామ్ లో స్టోరీ షేర్ చేశాడు. రాహుల్ తెవాటియా పోస్ట్ పై నెటిజెన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

పాకిస్తాన్ లోని హిందువులు, అక్కడి అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలను ధైర్యంగా లేవనెత్తిన తెవాటియాను మెచ్చుకుంటున్నారు. భారత్ లోని సెలబ్రిటీలు రాహుల్ ని చూసి బుద్ది తెచ్చుకోండి అని స్పందిస్తున్నారు నెటిజన్స్. రఫాలోని ఓ శరణార్ధి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో పిల్లలు, మహిళలతో పాటు 45 మంది పాలస్తీనా పౌరులు చనిపోయారు. నిజానికి ఈ దృశ్యాలు అందర్నీ కలిచివేశాయి. అందుకే భారత్ పాటు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు వాళ్ళకి సంఘీభావం తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆ ఫోటో ట్రెండింగ్ లో ఉంది. ఈ పోస్ట్ కి రోహిత్ శర్మ భార్య రితికా కూడా మద్దతు ఇచ్చి విమర్శలు పాలైంది. తర్వాత పోస్ట్ ను డిలీట్ చేసింది. కశ్మీరీ పండిట్స్, మణిపూర్ లో హింసతో పాటు దేశంలో సమస్యలపై ఎప్పుడైనా స్పందించారా అని జనం నిలదీశారు.

ఇదే టైమ్ లో పాకిస్థాన్ లో హిందువులపై జరుగుతున్న దురాగతాలను హైలెట్ చేస్తూ రాహుల్ చేసిన పోస్ట్ అందర్నీ కలిచి వేస్తోంది. సెలబ్రిటీలు ఈ పోస్టును కూడా షేర్ చేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు. మన కశ్మీర్ లో మానవహక్కుల గురించి అంతర్జాతీయ వేదికలను మాట్లాడుతూ పాకిస్తాన్ ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది. కానీ తమ దేశంలో హిందువుల భద్రత గురించి ఏనాడైనా పాక్ ఆలోచించిందా. అని జనం ప్రశ్నిస్తున్నారు.