India vs Pakistan : అహ్మదాబాద్‌ గడ్డ అశ్విన్ అడ్డా..

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికుల చూపంతా ఇప్పుడు భారత్‌-పాక్‌ మ్యాచ్‌ పైనే ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో రెండు విజయాలు సాధించి ఇరు జట్లు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. పాక్‌ బౌలింగ్‌ దళానికి.. భారత బ్యాటింగ్‌ వీరులకు మధ్య ఈ పోరు జరగనుందని మాజీలు విశ్లేషిస్తున్నారు. ఇటు అభిమానులు దాయాదుల పోరులో ఎవరు పైచేయి సాధిస్తారా అని లెక్కలు వేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికుల చూపంతా ఇప్పుడు భారత్‌-పాక్‌ మ్యాచ్‌ పైనే ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో రెండు విజయాలు సాధించి ఇరు జట్లు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. పాక్‌ బౌలింగ్‌ దళానికి.. భారత బ్యాటింగ్‌ వీరులకు మధ్య ఈ పోరు జరగనుందని మాజీలు విశ్లేషిస్తున్నారు. ఇటు అభిమానులు దాయాదుల పోరులో ఎవరు పైచేయి సాధిస్తారా అని లెక్కలు వేస్తున్నారు. ఈ మహా సంగ్రామానికి ఇరు జట్లు అస్త్రశస్త్రాలతో.. వ్యూహ ప్రతి వ్యూహాలతో సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి పూర్తి ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని భారత్‌-పాక్‌ పట్టుదలతో ఉన్నాయి.

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరిగే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలంగా ఉందన్న వార్తలు వస్తు‌న్నాయి. అహ్మదాబాద్‌ పిచ్ స్పిన్నర్లకే అనుకూలంగా ఉంటే పాకిస్తాన్‌ బ్యాటర్లకు తిప్పలు తప్పకపోవచ్చు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన అన్ని పిచ్‌ల కంటే అహ్మదాబాద్‌ పిచ్‌ ఎక్కువగా స్పిన్‌కు అనుకూలిస్తుందని మాజీలు అంచనా వేస్తు‌న్నారు. అదే నిజమైతే మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పగల టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కోవడం భారత్‌కు అంత తేలిక కాదు. టీమ్ ఇండియాలో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లను ఎదుర్కోవడం పాక్‌ బ్యాటర్లకు తలకుమించిన భారం కానుంది.