బ్రేకింగ్: బంగ్లాదేశ్ అలజడి, పార్లమెంట్ లో అఖిలపక్ష సమావేశం…!

  • Written By:
  • Publish Date - August 6, 2024 / 10:14 AM IST

బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసిన అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆమె రాజీనామాకు ముందు ఆ దేశంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల ప్రభావం భారత్ పై కూడా పడే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. దీనితో సరిహద్దుల్లో పెద్ద ఎత్తున భద్రతను కట్టుదిట్టం చేసారు. భారత్ నుంచి బంగ్లాదేశ్ కు నడిచే రైలు సర్వీసుని కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపధ్యంలో కేంద్రం కూడా బంగ్లాదేశ్ పరిణామాలను గమనిస్తోంది.

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పతనంపై చర్చించేందుకు ప్రభుత్వం ఈ రోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. షేక్ హసీనా నిన్న రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు. పార్లమెంట్‌లో జరిగే ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పరిస్థితిని ఎంపీలకు వివరించనున్నారు. బంగ్లాదేశ్‌ పరిస్థితిని విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. మోదీ హసీనాను కలుస్తారా లేదా అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. ఇప్పటికే భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆమెతో భేటీ అయ్యారు.