Alla Ramakrishna Reddy: ఎందుకెళ్లారు.. ఎందుకొచ్చారు..? ఆళ్ల రిటర్న్‌కు షర్మిలే కారణమా?

జానికి కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఏమాత్రం పట్టు లేదు. షర్మిల పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. షర్మిల మాటలతో బజ్ క్రియేట్ అయినట్లు కనిపిస్తున్నా.. అవన్నీ ఓట్ల రూపంలోకి మారే చాన్స్ ఏ మాత్రం లేదు.

  • Written By:
  • Publish Date - February 20, 2024 / 03:10 PM IST

Alla Ramakrishna Reddy: అటు ఇటు తిరిగి.. మళ్లీ ఇక్కడికే వస్తావని తెలుసు.. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వ్యవహారంతో.. ఇప్పుడు రాజకీయం అంతా మాట్లాడుకుంటున్న మాట ఇది. ఫ్యాన్‌ పార్టీ అధిష్టానం మీద అలిగి.. ఆ తర్వాత అసంతృప్తి వ్యక్తం చేసి.. పార్టీకి గుడ్‌ బై చెప్పి.. సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి.. షర్మిలక్కతోనే ప్రయాణం అని కాంగ్రెస్ ఆఫీస్‌ వైపు అడుగులు వేసి.. హస్తం పార్టీలో చేరి.. నెల రోజులు గడవకముందే మళ్లీ ఇప్పుడు యూటర్న్ తీసుకొని.. వైసీపీలో చేరిపోయారు ఆళ్ల రామకృష్ణారెడ్డి.

Jayalalitha: ఆరు ట్రంకు పెట్టెల్లో జయలలిత నగలు.. ఎవరికో తేల్చేసిన కర్ణాటక కోర్టు..

దీంతో అసలు ఆయన ఎందుకు వెళ్లారు.. మళ్లీ ఎందుకు వచ్చారు.. ఆయనను మళ్లీ పిలిచారా.. ఆయన పార్టీకి ఓ పిలుపు పంపారా.. కాంగ్రెస్‌లో ఎందుకు అడ్జస్ట్ కాలేకపోయారు.. అందులో భవిష్యత్‌ లేదు అనుకున్నారా.. లేదంటే షర్మిల తీరే కారణమా.. ఇలా చాలా ప్రశ్నలు రాజకీయవర్గాలతో పాటు జనాలను వెంటాడుతున్నాయ్. ఆళ్లను సొంతగూటికి తీసుకురావడంలో.. రాజ్యసభ సభ్యుడు, ఆయన సోదరుడు అయోధ్య రామిరెడ్డి కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఏమాత్రం పట్టు లేదు. షర్మిల పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. షర్మిల మాటలతో బజ్ క్రియేట్ అయినట్లు కనిపిస్తున్నా.. అవన్నీ ఓట్ల రూపంలోకి మారే చాన్స్ ఏ మాత్రం లేదు. ఇలాంటి విషయాలు అన్నీ ఆలోచించే.. ఆళ్ల తిరిగి సొంత గూటికి చేరుకున్నారని తెలుస్తోంది. ఇక అటు మంగళగిరి టికెట్ ఇవ్వకున్నా.. ఆర్కేకు కీలక పదవి ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం రెడీ అయింది. ఇదే విషయాన్ని తెలిపి అయోధ్య రామిరెడ్డి వైసీపీలో తిరిగి చేరేలా ఆళ్లను ఒప్పించినట్టు సమాచారం. ఆర్కే కూడా వచ్చి చేరడంతో తిరిగి మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను సులభంగా ఓడించవచ్చని వైసీపీ భావిస్తోంది.

ఇక అటు ఆళ్ల రిటర్న్‌తో వైసీపీకి మరింత ప్లస్ అవడం ఖాయం. ప్రస్తుతం మంగళగిరిలో వైసీపీని గ్రూప్ రాజకీయాలు ఇబ్బంది పెడుతున్నాయ్. వాటిని కాస్త సెట్‌ రైట్ చేస్తే.. ఎలాగూ మంగళగిరి మీద పట్టు ఉన్న ఆర్కే పక్కనే ఉన్నాడు కాబట్టి.. టీడీపీకి గట్టి పోటీ ఇవ్వొచ్చని.. వైసీపీ నేతలు లెక్కలేస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. ఊరికే రారు రాజకీయ నేతలు అన్నట్లుగా.. ఆళ్ల రిటర్న్‌తో ఇప్పుడు మంగళగిరి రాజకీయ సమీకరణాలు భారీగా మారే చాన్స్ ఉంది. ఆళ్ల ఎగ్జిట్‌తో ఏపీ కాంగ్రెస్‌కు.. ముఖ్యంగా షర్మిలకు భారీ షాక్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు.