బన్నీకి పవన్ కంటే అతనే ఎక్కువా…? గ్రాండ్ గా విషెస్

మెగా, అల్లు కుటుంబాల మధ్య వివాదం అందరికి తెలిసిందే. ఈ వివాదం వీలైనంత త్వరగా సమసిపోవాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ మధ్యలో సంబంధం లేని కొందరు విమర్శలు చేయడంతో విమర్శల తీవ్రత పెరుగుతూ వస్తుంది.

  • Written By:
  • Publish Date - September 2, 2024 / 01:13 PM IST

మెగా, అల్లు కుటుంబాల మధ్య వివాదం అందరికి తెలిసిందే. ఈ వివాదం వీలైనంత త్వరగా సమసిపోవాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ మధ్యలో సంబంధం లేని కొందరు విమర్శలు చేయడంతో విమర్శల తీవ్రత పెరుగుతూ వస్తుంది. రాజకీయంగా కూడా ఇది మలుపు తిరగడంతో మెగా ఫ్యామిలీలో ఆందోళన మొదలయింది. ఇన్నేళ్ళ నుంచి కలిసి ఉన్న కుటుంబం ఇలా మనస్పర్ధలతో ఉండటం చూసి ఫాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. మెగా ఫ్యామిలీలో చీలిక రాకుండా చూడాలని కుటుంబంలో ఉన్న పెద్దలను అభిమానులు కోరుతున్నారు.

ఇక అల్లు అర్జున్ కు పవన్ కళ్యాణ్ కు మధ్య ఎప్పటి నుంచో గ్యాప్ ఉందనే వార్తలు సైతం వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఫాన్స్ పై అల్లు అర్జున్ పలు మార్లు సీరియస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల పుష్ప సినిమాపై పవన్ కళ్యాణ్ పరోక్షంగా చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయని చెప్పాలి. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఈ సమస్య పరిష్కారం కోసం కొందరు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు సైతం వచ్చాయి. ఇక నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో బన్నీ విష్ చేస్తాడా లేదా అని అందరూ ఎదురు చూసారు.

విష్ చేసాడు గాని ఏదో పరాయి వ్యక్తికి చేసినట్టు చేసాడు అంటున్నారు ఫాన్స్. మెనీ మోర్ హ్యాపి రిటర్న్స్ ఆఫ్ ది డే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ బన్నీ పోస్ట్ చేసాడు. దీనికి సంబంధించి ఏ ఫోటో పవన్ పోస్ట్ చేయలేదు. అయితే తన ఫ్రెండ్ సందీప్ రామినేనిని ట్యాగ్ చేస్తూ గ్రాండ్ గా విష్ చేసాడు. అతనితో దిగిన ఫోటోని పోస్ట్ చేస్తూ హ్యాపీ బర్త్ డే మై లైఫ్ లైన్ అంటూ స్టోరీ పెట్టాడు. దీనిపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ కంటే అతను ఎక్కువా అంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.