వైసీపీకి 11 వ నెంబర్ కు ఏదో అనుబంధం ఉంది. 11 అనే నెంబర్ వింటే చాలు వైసిపి నాయకులు కార్యకర్తలు ఆ పార్టీ అభిమానులు అందరిలో కూడా ఒకరకంగా భయపడటం, బాధపడటం జరుగుతూ ఉంటుంది. 2024 ఎన్నికల్లో జగన్ 11 వ తారీకు ప్రమాణ స్వీకారం చేద్దాం అనుకుని రెడీ అయ్యారు. కానీ ఊహించని విధంగా ఆ పార్టీకి 11 సీట్లు మాత్రమే రావడం తో ఒక్కసారిగా పరిస్థితి కకావికలమైంది. ఇక అమరావతి ఉద్యమానికి ఆ 11 నెంబర్ కు ఏదో తెలియని లింక్ ఉంది. చంద్రబాబు నాయుడు 1631 అని నెంబర్లు చెప్పారు.
ఇలా 11 నెంబర్ వైసీపీ చరిత్రలో అత్యంత భయంకరమైన రోజుగా మిగిలిపోయింది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ 23వ కూడా ఇలాగే. వైసిపి నుంచి 2014 తర్వాత 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తన పార్టీలోకి తీసుకుంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23వ తారీకు ఎన్నికల ఫలితాలు రాగా ఆ పార్టీకి 23 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ అల్లు అర్జున్ ను కూడా వెంటాడుతోంది. అల్లు అర్జున్ కు 11 వ తారీఖు… అసలు 11 అనే నెంబర్ ఏమాత్రం కలిసి రాలేదు అనే పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అవును వైసిపి అభ్యర్థి, తన క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా నంద్యాల ఎన్నికల ప్రచారానికి అల్లు అర్జున్ వెళ్ళాడు. ఆ వెళ్లిన తేదీ మే 11. అక్కడి నుంచి అల్లు అర్జున్ కు మెగా ఫ్యామిలీకి మధ్య దూరం బాగా పెరిగింది. తెలుగుదేశం పార్టీ కూడా అప్పుడు అల్లు అర్జున్ ను పెద్ద ఎత్తున టార్గెట్ చేసింది. ఇక సంధ్య థియేటర్ ఘటన రాత్రి 11 గంటలకు జరిగింది. అదే కేసులో అల్లు అర్జున్ ఏ11 గా చేర్చారు. ఇక నిన్న అల్లు అర్జున్ విచారణకు వెళ్ళింది కూడా ఉదయం 11 గంటలకే. దానికి తోడు జగన్ ను కోర్టుకు హాజరు కావాల్సిన శుక్రవారం అల్లు అర్జున్ కూడా అరెస్టు అయ్యాడు.
ఇప్పుడు ఇవన్నీ సోషల్ మీడియాలో ఒక సెంటిమెంట్ అల్లు అర్జున్ వెంటాడుతోందని… వైసీపీకి సపోర్ట్ చేశాడు కాబట్టే ఆ దరిద్రం అల్లు అర్జున్ అంటుకుంది అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. వైసిపి అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన జీవితంలో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. రాజకీయంగా ఎప్పుడూ అల్లు అర్జున్ పేరు చర్చల్లో లేదు.
ఏకంగా శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ టార్గెట్ గా ప్రసంగం చేశారు. ఇక సినిమా పరిశ్రమలో అల్లు కుటుంబం ఇప్పుడు ఒంటరి అయిపోయింది అనే కామెంట్స్ కూడా ఉన్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి విడిపోవడం ఐకాన్ స్టార్ గా గుర్తింపు కోసం అల్లు అర్జున్ ప్రయత్నాలు చేయడం, అక్కడి నుంచి కేసులు… అరెస్టులు… జైలుకు వెళ్లడం వంటి పరిణామాలు అన్నీ కూడా తలనొప్పిగానే ఉన్నాయి. ఈ తలనొప్పులన్నీ పోవాలి అంటే ఆ 11 అనే నెంబర్ అల్లు అర్జున్ జీవితం నుంచి పోవాలి అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. 11 పోవడం అంటే అర్ధమయ్యే ఉంటుందిగా…?