Whatsapp New Feature : వాట్సాప్ లో అద్భుతమైన అప్డేట్.. వాట్సాప్ స్టేటస్ ను ఫిల్టర్ చేసుకోవచ్చు

వాట్సాప్ ఈ యాప్ తెలియని వారు ఉండరు.. ఈ యాప్ లేని ఫోన్ ఉండదు.. ప్రపంచ వ్యాప్తంగా 2020 నాటికి రెండు బిలియన్ వాట్సాప్ వినియోగదారులు ఉన్నారు. వాట్సాప్ ని ఎంతలా వినియోగిస్తున్నారు అంటే.. ప్రతి రోజు 50 కోట్లకు పైగా ఫోటోలు, 1,000 కోట్లకు పైగా మెసేజ్ లు దీని ద్వారా షేర్ అవుతున్నట్లు వాట్సాప్ యజమాన్యం అంచనా వేసింది.

వాట్సాప్ ఈ యాప్ తెలియని వారు ఉండరు.. ఈ యాప్ లేని ఫోన్ ఉండదు.. ప్రపంచ వ్యాప్తంగా 2020 నాటికి రెండు బిలియన్ వాట్సాప్ వినియోగదారులు ఉన్నారు. వాట్సాప్ ని ఎంతలా వినియోగిస్తున్నారు అంటే.. ప్రతి రోజు 50 కోట్లకు పైగా ఫోటోలు, 1,000 కోట్లకు పైగా మెసేజ్ లు దీని ద్వారా షేర్ అవుతున్నట్లు వాట్సాప్ యజమాన్యం అంచనా వేసింది.

Uttarakhand Uttarkashi : సొరంగంలో 41 మంది కార్మికులు.. ఆహారంగా కిచిడీ పంపిన అధికారులు

ప్రతిసారి వాట్సాప్ యాజమాన్యం తన యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకోస్తుంది.ప్పుడు కూడా అదే ప్రయత్నం చేసింది మోటా సంస్థ. ఇక విషయంలోకి వెళితే.. ప్రముఖ ఇన్‌ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తూంది. తాజాగా ‘స్టేటస్ అప్‌డేట్స్‌ ఫిల్టర్’ (Status updates filter) పేరుతో ఒక యూజ్‌ఫుల్ ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది. నాలుగు ఫిల్టర్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉంచారు. ఈ లిస్టు పైన స్టేటస్ అప్‌డేట్స్‌ ఫిల్టర్ చేసుకోవడానికి వీలుగా నాలుగు ఫిల్టర్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఆ ఫిల్టర్స్‌లో ఆల్ , రీసెంట్, వ్యూయిడ్, మ్యూటెడ్ ఉన్నాయి. వీటిలో “ఆల్” పైన నొక్కితే అన్ని స్టేటస్ అప్‌డేట్స్‌ కనిపిస్తాయి. “రీసెంట్”పై ట్యాప్ చేస్తే లేటెస్ట్ స్టేటస్‌లు మాత్రమే డిస్‌ప్లే అవుతాయి. దీనివల్ల ఓల్డ్ స్టేటస్‌లు స్క్రోల్ చేయాల్సిన అవసరం లేకుండా మోస్ట్ రీసెంట్‌వి సింపుల్‌గా చూసుకోవచ్చు. దీనితో యూజర్లు స్టేటస్ అప్‌డేట్లను ఫిల్టర్ చేసుకోవచ్చు. అంతేకాదు వెర్టికల్ లిస్ట్‌లో స్టేటస్ అప్‌డేట్లను చూసుకోవచ్చు.

Telangana Elections : నిన్న పొంగులేటి.. ఇవాళ వివేక్‌.. కాంగ్రెస్ అభ్యర్థులపై ఐటీ వేట..

ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.23.25.3 వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకున్న కొంతమంది యూజర్లకు కొత్త ఫీచర్ విడుదల అవుతోంది. అప్‌డేట్ అందుకున్న యూజర్లు ఇప్పుడు మ్యూట్ చేసిన స్టేటస్ అప్‌ డేట్‌ లను ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. వాట్సాప్ అప్‌ డేట్‌ లను ట్రాక్ చేసే వాట్సాప్‌ బీటా ఇన్ఫో, ఈ కొత్త స్పెసిఫికేషన్ గురించి మరిన్ని విశేషాలు వెల్లడించింది. ఇలాంటి కొత్త కొత్త ఫీచర్స్ తీసుకొచ్చి యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరుస్తోంది.