World Spaceships : మూడు దేశాలు.. 65 ఏళ్లు.. 146 అంతరిక్షనౌకలు.. ఇదే ప్రపంచ అంతరిక్ష నౌకల చరిత్ర

చందమామపై కాలుమోపేటందుకు ముందుగా కృషి చేసింది అగ్రరాజ్యాలే అని చెప్పాలి. అమెరికా, రష్యాలే అధికంగా ప్రయోగాలు చేశాయి. ఈ కోవలోకి భారత్ ఇప్పుడు వచ్చి చేరింది. ఈ ప్రయోగాల లక్ష్యం మాత్రం మానవులకు జీవించేందుకు మరో ఆవాసాన్ని ఏర్పాటు చేయడమే. ఈ ప్రయత్నాలు ఎప్పటికి ఫలించి అక్కడ నివసించేందుకు దోహదపడుతుందో దశాబ్ధాల కాలంగా వేచిచూడక తప్పడం లేదు.

  • Written By:
  • Publish Date - August 23, 2023 / 02:30 PM IST

చంద్రయాన్ పై అడుగుపెట్టేందుకు ముందుగా దోహదపడ్డ దేశాలను కేవలం వేళ్లలో లెక్కపెట్టవచ్చు. ముందుగా అమెరికా, చైనా, రష్యాలు ప్రయత్నాలు చేయగా మన భారత్ కూడా ఇందులో ప్రయత్నాలు చేయడం శభపరిణామం. 1950 నుంచి చంద్రుడి చెంతకు చేరుకునేందుకు తీవ్రంగా శ్రమించాయి. అందులో చాలా రాకెట్లు విఫలం చెందగా కొన్ని మాత్రమే ప్రయోగంలో విజయం సాధించాయి. అందులో మరో కొన్ని చిన్న దేశాలు కూడా ఉన్నాయి. జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ, యూఏఈ, ఇజ్రాయిల్, ఈక్కెండార్, లగ్జెంబర్గ్ ప్రదానంగా ఉన్నాయి.

కొన్ని ముఖ్యమైన అంతరిక్షనౌకలు ఇవే..

చంద్రమండలాన్ని చేరిన రష్యా రాకెట్లు

లూనా 2: ఇది రష్యన్ అంతరిక్షనౌక. దీనిని 1959 సెప్టెంబర్ 12 న ప్రయోగించారు. దీనిని మొట్టమొదటి మానవ నిర్మిత వస్తువుగా గుర్తించారు.

లూనా 3: ఇది కూడా రష్యన్ నౌకే. దీనిని 1959 అక్టోబర్ 4 న లూనా 2 కి కొనసాగింపుగా ప్రయోగించారు. ఈ రాకెట్ దాదాపు చంద్రుని వద్దకు చేరుకొని అక్కడి ఫోటోలు తీసిన తొలి రాకెట్ గా ఖ్యాతి గణించింది.

8లూనా 9: చాలా కాలం ప్రయోగాలు చేయగా మొట్టమొదటి సారి చంద్రుడి పై సాఫ్ట్ ల్యాండింగ్ అయిన మానవరహిత అంతరిక్ష నౌకగా చెబుతారు. దీనిని 1966 ఫిబ్రవరి 3 న పంపించారు.

లూనా 10: భూమి నుంచి వెళ్లిన తరువాత చంద్రుని కక్ష్యలో సుమారు 460 సార్లు తిరిగింది ఇదే దీని ప్రత్యేకత. దీనిని 1966 మార్చి 31 న ప్రయోగించారు. ఇందులో కూడా మనుషులు ఎవరూ ప్రయాణించలేదు.

లూనార్ ఆర్బిటన్ 5: ఈ అంతరిక్ష నౌకల్లో మనుషుల వెళ్లే వారు. దీనినిన 1967 ఆగస్ట్ 1 న ఏర్పాటు చేశారు. దీని ద్వారా చంద్రుడిపైకి వెళ్లి సుమారు 99శాతం చంద్రమండలాన్ని మ్యాప్ చేసేందుకు వెసులుబాటు కలిగింది.

లూన్వా 16: రష్యా ఎక్కువగా మానవ రహిత అంతరిక్ష నౌకలనే పంపించేందుకు మక్కువ చూపింది. దీనికంటే ముందు ఒకసారి మనుషులు చంద్రుడిపైకి వెళ్లి వచ్చినప్పటకీ.. 1970 సెప్టెంబర్ 12న ప్రయోగించిన వాటిలో తిరిగి మానవ రహితంగానే పంపించింది.

లూనార్ ప్రాస్పెక్టర్: ఈ నౌక ద్వారా చంద్రుడిపై ఉన్న నీరు, ఇతర ఖనిజాల సంపూర్ణ సమాచారాన్ని సేకరించగలిగారు. దీనిని 1998 జనవరి 1 న ప్రయోగించారు. సుమారు 19 నెలల పాటూ అంతరిక్షంలో సంచరించింది.

అమెరికా అంతరిక్ష నౌకలు ఇవే..

అపోలో 8: అన్నింటా ముందుండే అమెరికా అంతరిక్ష ప్రయోగంలో మాత్రం కాస్త జాప్యం చేసింది. 1968 డిసెంబర్ 21న ముగ్గురు మానవులతో చంద్రుడిపైకి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇందులో ఫ్రాంక్ బోర్మాన్, జేమ్స్ లోవెల్, విలియం ఆండర్స్ ఉన్నారు. వీరే చంద్రుడిని సంచరించిన తొట్టతొలి వ్యోమగావులుగా చెప్పాలి.

అపోలో 11: ఈ రాకెట ప్రయోగంతో అగ్రరాజ్యం అమెరికా ముందుకు దూసుకువచ్చింది. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ను పంపించి చంద్రుడిపై మొట్టమొదటి సారి కాలుమోపిన వ్యోమగామిగా చరిత్ర సృష్టించింది. ఇది 1969 జూలై 20న జరిగింది. దాదాపు నాలుగు రోజులపాటూ జాబిల్లిపై ఉండగలిగారు.

చైనా రాకెట్

చేంజ్-5: ప్రపంచంలో టెక్నాలజీలో ముందుండే చైనా అంతరిక్షంలో కూడా తనదైన మార్క్ వేసుకుంది. చంద్రుడిపై ఉన్న నమూనాలను భూమిపైకి తీసుకువచ్చింది. నేటికీ ఈ మిసణ్ దీర్ఘకాల చంద్రకక్ష్యలో తిరుగుతూ ఉంది.

ఈ నౌకలతోపాటూ మరిన్ని రాకెట్లను వివిధ దేశాలు ప్రయోగించాయి. ఇలా ప్రయోగానికి శ్రీకారం చుట్టినప్పటికీ ఆశించినంత విజయాన్ని వరించలేదు. చాలా వరకు విఫలం చెందినవే ఉన్నాయి. ఇలా 1958 నుంచి 2023 వరకూ దాదాపు 65 ఏళ్లలో 146 అంతరిక్ష నౌకలను చంద్రుడిపైకి పంపినట్లు తెలుస్తుంది.

T.V.SRIKAR